• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్‌ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిట్ కాయిన్

క్రిప్టో కరెన్సీని వేగంగా అడాప్ట్ చేసుకుంటున్న 20 దేశాల్లో భారత్‌ నిన్నమొన్నటి వరకు 2వ స్థానంలో ఉంటూ వచ్చింది.

భారత్‌లో సుమారు కోటి నుంచి రెండున్నర కోట్ల మంది క్రిప్టో లావాదేవీలు చేస్తున్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసినా క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజర్లు ప్రకటనలతో హోరెత్తించేస్తూ ఉండేవి.

ఇవన్నీ కలిపి భారత్‌లో క్రిప్టో కరెన్సీ మైనింగ్‌కి ఎక్కడ లేని హైప్ వచ్చింది.

మీకు తెలిసిన వారిలోనే కొందరు ఇప్పటికే మైనింగ్ చేస్తూ ఉండవచ్చు. అయితే అలాంటి వాళ్లంతా.. ఇప్పుడు మీ ముందుకొచ్చి తప్పు చేశాం అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లో దాదాపు 70 వేల డాలర్ల (రూ.54 లక్షలు)వరకు ట్రేడ్ అయిన బిట్ కాయిన్ విలువ జూన్ 15 బుధవారం నాటికి ఏకంగా సుమారు 20వేల డాలర్లకి (రూ.15 లక్షలు) పడిపోయింది.

ఒక వేళ మీరు క్రిప్టో మార్కెట్‌ను గమనిస్తూ వస్తూ ఉంటే.. ఇప్పటికే ఆ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉందన్న విషయం మీకు బాగా అర్థమై ఉంటుంది.

బిట్ కాయిన్

అసలు ఏం జరిగింది?

ముందే చెప్పినట్టు జూన్ 15 బుధవారం నాటికి బిట్ కాయిన్ సుమా 20,500 డాలర్ల (రూ16 లక్షలు) వద్ద ట్రేడ్ అవుతూ వచ్చింది. కేవలం గడిచిన వారం రోజుల్లోనే అంటే జూన్ 9 నాటితో పోల్చినా 30శాతానికి పైగా విలువ పడిపోయింది. మొత్తంగా రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం ఇప్పుడు అత్యంత ఆందోళన కల్గించే అంశం.

ఇటీవల మార్కెట్ లో క్రిప్టో కరెన్సీల పతనం కనిపిస్తోంది

ఎందుకిలా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రభావం కేవలం క్రిప్టో ప్రపంచంపై మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ ఉందన్నది వారి వాదన. ఏ క్షణాన్నైనా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు ఓ వైపు, రోజు రోజుకీ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం మరోవైపు. వాటికి తోడు కొద్ది రోజులుగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదొడుకులు. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగింది.

వీటన్నింటి కారణంగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్నారు. సాధారణ పెట్టుబడిదారులు, కార్పొరేషన్లు, చివరకు మీలాంటి వాళ్లు, నాలాంటి వాళ్లు కూడా పెట్టుబడుల జోలికే వెళ్లడం లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకోవడం అవసరమా అని అనుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

క్రిప్టో లావాదేవీలను అధికారికంగా గుర్తిస్తున్న దేశాలు వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం ఎందుకు అన్న ఆలోచన కూడా చాలా మందిలో ఉంది.

బిట్ కాయిన్ ధర గత ఆర్నెల్లలో సగానికి పడిపోయింది

ఇప్పుడే ఎందుకు?

నిజానికి గత నెలలోనే బిట్ కాయిన్, ఎథేరియం వంటి పేరున్న క్రిప్టో కరెన్సీలు నవంబర్ నెల తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మదుపర్ల ఆత్మ విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

ఫలితంగా ఒక్కసారిగా అమ్మకాలు పెరగడం మొదలయ్యింది.

ఎక్కువ మంది అమ్మే కొద్దీ బిట్ కాయిన్ విలువ క్షీణించడం మొదలయ్యింది. సాధారణంగా మన భాషలో చెప్పాలంటే దానిపై మోజు పెరిగే కొద్దీ విలువ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో అమ్మే వాళ్లు ఎక్కువవుతూ వచ్చారు. ఆ సైకిల్ అలాగే కొనసాగుతూ వస్తోంది.

మిగిలిన సంప్రదాయ ఆస్తులకు ఉన్నట్టు బిట్ కాయిన్‌కు మద్దతుగా నిలిచేందుకు దానికి నికరమైన విలువ అంటూ ఏదీ ఉండదు. మరోమాటలో చెప్పాలంటే బిట్ కాయిన్ విలువను కాపాడేందుకు సిమెంటు, రాళ్లతో కూడిన ఎలాంటి పునాదీ ఉండదని ఫైనాన్సియల్ టైమ్స్ మార్కెట్ ఎడిటర్ కేట్ మార్టిన్ అన్నారు.

జనం మీ దగ్గరున్న బిట్ కాయిన్‌ను ఎంత పెట్టి కొనేందుకు సిద్ధమవుతారో నికరంగా అదే దాని ధర అని ఆమె అన్నారు.

ఇప్పటికే బిట్ కాయిన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో గడిచిన 3-4 రోజుల్లో జరిగిన పరిణామాలను గమనిస్తే చెప్పుకోదగ్గ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్ సంస్థల్లో ఒకటైన గ్లోబల్ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్ బినాన్స్ ఇటీవల బిట్ కాయిన్ విత్ డ్రాలను కొన్ని గంటల సేపు నిలిపేసింది. సాంకేతిక కారణాల వల్లనే ఇలా జరిగిందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని చాలా మంది నమ్మలేదు.

క్రిప్టో లెండర్ సెల్సియస్‌ కూడా అలాగే చేసింది. అయితే ఆ సంస్థ మాత్రం సాంకేతిక కారణాలు అన్న సంగతి చెప్పకుండా, మార్కెట్లో తలెత్తిన విపరీత పరిణామాలే అని చెప్పుకొచ్చింది. అలాగే కాయిన్ బేస్ ఎక్స్‌ఛేంజ్ కూడా బిట్ కాయిన్ కుప్పకూలడంతో తన సిబ్బందిలో 18శాతం మందిపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది.

అన్నింటికీ మించి ఇప్పటికే బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు అమ్మడం మొదలుపెట్టేశారు కూడా.

పరిస్థితులు ఎలా మారవచ్చు?

ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితులు మళ్లీ కుదుటపడాలి. అంటే ఇప్పటికీ బిట్ కాయిన్‌పై నమ్మకం ఉన్న వారు, వాటిని ఇతరులు మళ్లీ కొనడం మొదలుపెట్టేంత వరకు అట్టి పెట్టుకొని ఉంచుకోవడమే మంచిది. గతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇక క్రిప్టో ఫ్యాన్స్ విషయానికి వస్తే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఇది సువర్ణ అవకాశమని ఇంత కన్నా తక్కువ ధరకు దొరికే అవకాశం లేదని చెబుతారు. అంటే ఇప్పుడు కొన్న వాళ్లు తమ దగ్గరే అట్టి పెట్టుకొని ఎప్పుడెప్పుడు మళ్లీ విలువ పెరుగుతుందా అని ఎదురు చూడాల్సిందే. గతంలో కూడా అదే సూత్రం పని చేసింది.

రాత్రికి రాత్రే ధనవంతులైన వాళ్ల కథలు, హై ప్రొఫైల్ సెలిబ్రెటీల ఒప్పందాలు కూడా క్రిప్టో విలువను పెంచుతుంటాయి.

అయితే ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు మాత్రం పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is Bitcoin collapsing so fast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X