వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్రోసాఫ్ట్ నుంచి మరో కొత్త ఓఎస్? గూగుల్ ‘క్రోమ్’కి పోటీయా?

తన ‘విండోస్’ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్)తో కంప్యూటర్ ప్రపంచాన్ని ఏలుతున్న మైక్రోసాఫ్ట్ తాజాగా ‘విండోస్ 10 క్లౌడ్’ పేరుతో మరో కొత్త ఆపరేటింగ్ సిస్టంను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తన 'విండోస్' ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్)తో కంప్యూటర్ ప్రపంచాన్ని ఏలుతున్న మైక్రోసాఫ్ట్ తాజాగా మరో కొత్త ఆపరేటింగ్ సిస్టంను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే సాఫ్ట్ వేర్ మార్కెట్ లో పుంజుకుంటున్న గూగుల్ 'క్రోమ్'ఓఎస్ కు పోటీగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో కొత్త వెర్షన్ ను రూపొందిస్తోందట. క్రోమ్ ఓఎస్ ను వినియోగిస్తున్న వినియోగదారులు తమ ఫైళ్లను క్లౌడ్ లో స్టోర్ చేయాల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి 'విండోస్ 10 క్లౌడ్' పేరుతో ఇలాంటి ఆపరేటింగ్ సిస్టంనే అభివ‌ద్ధి చేస్తోందట. ఇందులో పూర్తిగా విండోస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ లు మాత్రమే పని చేస్తాయట.

Windows 10 Cloud is Microsoft’s fresh Chrome OS alternative

ప్రస్తుతం గూగుల్ క్రోమ్ ఓఎస్ లోనూ అదే పరిస్థితి. ఇప్పటి వరకు క్రోమ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ లను మాత్రమే వినియోగించుకునే వీలుండేది. అయితే ఇకనుంచి క్రోమ్ వినియోగదారులకు కొత్త సౌలభ్యం అందుబాటులోనికి రానుంది.

వీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్ లను కూడా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చని గూగుల్ ఇటీవలే ప్రకటించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ సిద్ధం చేస్తున్న కొత్త ఓఎస్ ఈ ఏడాదే మార్కట్ లోకి వచ్చే అవశాశాలు ఉన్నట్లు సమాచారం.

English summary
Microsoft has been trying to keep PC makers away from Chrome OS for years, and consumers far away from Apple’s iPad alternative. The software giant is experimenting with another low-cost version of its popular Windows operating system: Windows 10 Cloud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X