జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారూ.. ఆదుకోండి... కరోనాతో జీవితాలు కకావికలం, ప్రైవేట్ టీచర్ల వెతలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం రూపుమారిపోయింది. మార్కెట్ కుప్పకూలిపోయింది. వర్క్ ఫ్రం హోం నడుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. కరోనా చాలామంది జీవితాలను చిధ్రం చేసింది. ఇక ప్రైవేటు ఉపాధ్యాయులు గురించి అయితే చెప్పక్కర్లదు. వారు రోడ్డున పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

చంద్రశేఖర్ పరిస్థితి ఇదీ..

చంద్రశేఖర్ పరిస్థితి ఇదీ..

ఇక జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన గడప చంద్రశేఖర్‌ పరిస్థితి మరీ ఘోరం. సీఎం కేసీఆర్‌కు తమ దుస్థితి వివరిస్తూ వీడియోను కూడా రూపొందించారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ గారికి నమస్కారాలతో అంటూ ఆయన వీడియో స్టార్ట్ అవుతోంది. జగిత్యాల పోచమ్మవాడలో ఉంటానని చెప్పారు. గత 20ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నానని.. అరకొర జీతాలతో ఇన్నాళ్లు పనిచేశామని వివరించారు.

 స్కూల్స్ క్లోజ్

స్కూల్స్ క్లోజ్

కరోనా వల్ల ఏడాది పాటు స్కూల్స్‌ మూత పడ్డాయని తెలిపారు. దీంతో ఉపాధి కోల్పోయామని.. జీవించడానికి అప్పులు చేశామని మొర వినిపించారు. అప్పులు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. లోన్‌లో బండి తీసుకున్నానని.. ఈఎంఐ కూడా కట్టలేక పోతున్నామని చెప్పారు. ఫైనాన్స్‌ వేధింపులు కూడా ఎక్కువయ్యాయని వివరించారు. బతకలేని స్థితిలో ఉన్నామని.. తమకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.

ప్రైవేట్ టీచర్లు అంటే చిన్నచూపు

ప్రైవేట్ టీచర్లు అంటే చిన్నచూపు

ప్రైవేట్ టీచర్లు అంటే ఎందుకు చిన్నచూపు అని అడిగారు. ప్రైవేటు టీచర్‌గా పనిచేయడమే మేం చేసిన తప్పా అని అడిగారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తనకు సెంటు భూమి కూడా లేదని.. అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. గత పన్నెండు నెలల నుంచి అద్దె కూడా కడతలేమని... తన భార్య బీడీలు చేస్తదని గుర్తుచేశారు.

బీడీ కంపెనీలు కూడా మూత

బీడీ కంపెనీలు కూడా మూత

ఆ బీడీ కంపెనీ కూడా సరిగా నడవడం లేదన్నారు. కరోనాతో ఇద్దరం ఉపాధి కోల్పోయామని వివరించారు. కూతురు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ అని... ఇప్పుడు డిగ్రీ చదివించే పరిస్థితి కూడా లేదన్నారు. కుమారుడి ఆరోగ్యం వారం రోజుల నుంచి బాగాలేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చూపించే పరిస్థితి లేదని వివరించారు. భార్య, పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టే స్థితి లేక పస్తులు ఉంటున్నామని వాపోయారు. తమ కుటుంబం కూడా మరో సునీల్‌ కుటుంబంగా మారకముందే.. కాపాడాలని కోరారు.

English summary
private teacher chandrashekar asks to cm kcr for help his family due to corona virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X