బండి సంజయ్‌కు వడదెబ్బ, డీ హైడ్రెషన్, ఎసిడిటీ.. అయినా పాదయాత్రకు నో బ్రేక్
ఎండ ప్రభావం ఎక్కువగానే ఉంది. కానీ నేతలు మాత్రం ప్రజలతో కలిసి పోవాల్సిందే. రాజకీయ నేతలు పాదయాత్ర చేపడుతున్నారు. అయితే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. మండుటెండలో ఆయన యాత్ర కొనసాగుతోంది. గత 11 రోజుల నుంచి యాత్ర కంటిన్యూ అవుతుంది.

అస్వస్థత
==మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యులు పరీక్షించి, చికిత్స అందించారు. వడదెబ్బ, డీ హైడ్రేషన్, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

విరామం..
పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. బండి సంజయ్ మాత్రం పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరికాసేపట్లో పాదయాత్ర తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. పాదయాత్ర వద్దని వైద్యులు చెప్పిన.. బండి సంజయ్ వినడం లేదు. కొద్దీ రోజులు బ్రేక్ తీసుకోవాలని అంతా కోరుతున్నారు. కానీ ఆయన మాత్రం మెట్టు దిగడం లేదు.

మోసకారి
సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి.. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో పర్యటించారు. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు.

విసిగిపోయిన జనం
కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్‌ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండమని దుయ్యబట్టారు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చని కానీ కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు.