మానవ మృగం .. తండ్రి స్థానంలో ఉండి కూతురిపై దారుణం, ఆర్నెల్లుగా అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. మానవ సంబంధాలను, అనుబంధాలను మరచి కాపాడాల్సిన కన్నతండ్రులే కామపిశాచుల్లా మారి బిడ్డల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, కుమార్తెను ఐదు నెలల గర్భవతిని చేసిన ఉదంతం మరిచిపోకముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో దారుణ ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది.

నెల్లూరు వెంకటగిరిలో దారుణం .. కుమార్తె పై పెంచిన తండ్రి లైంగిక దాడి

నెల్లూరు వెంకటగిరిలో దారుణం .. కుమార్తె పై పెంచిన తండ్రి లైంగిక దాడి

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దళితవాడకు చెందిన అంజయ్య అనే వ్యక్తి తండ్రి స్థానంలో ఉండి పద్నాలుగేళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంజయ్య కు వివాహం కాగా అతను తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న మరో మహిళతో సంబంధం పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుండి ఆ మహిళ తన ఇద్దరు బిడ్డలతో అతనితో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె కాగా కుమార్తె పై కన్నేసిన అంజయ్య ఆరు నెలలుగా కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

 14ఏళ్ళ బాలికపై ఆర్నెల్లుగా అత్యాచారం

14ఏళ్ళ బాలికపై ఆర్నెల్లుగా అత్యాచారం


పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఆర్నెల్లుగా బాలిక చిత్రవధ అనుభవిస్తుంది. బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోవడంతో బాలిక తన సోదరుడికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా అది గమనించిన బాలిక తమ్ముడు కేకలు వేసి స్థానికులను పిలిచాడు. దీంతో అంజయ్య చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అంజయ్య పరారీలో ఉన్నాడు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో చట్టం క్రింద కేసు నమోదు .. ఏపీలో పెరిగిపోతున్న దారుణాలు

పోక్సో చట్టం క్రింద కేసు నమోదు .. ఏపీలో పెరిగిపోతున్న దారుణాలు

స్థానిక మహిళా సంఘం నాయకులు ఇలాంటి వారికి కఠిన శిక్ష పడేవరకు వదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. అభం శుభం తెలియని అమ్మాయిని, బిడ్డ అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు గురి చెయ్యటం దారుణం. వావివరుసలు మరచి ఇలా వ్యవహరించే కామాంధులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని పోలీసులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక స్త్రీలు, బాలికల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలు కూడా కామాంధుల లైంగిక దాడులకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+