వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వానరం.. ఏందిదీ, గౌడన్న ఏం కావాలే.. ఫూటుగా తాటికల్లు తాగుతున్న కోతి..

|
Google Oneindia TeluguNews

కల్లు తాగిన కోతిలా.. అనే నానుడిని వింటాం.. కానీ ఓ గౌడ్ ఆ పరిస్థితిని స్వయంగా చూశాడు. చూడటం కాదు.. అతని బాధ వర్ణణాతీతం.. ఎందుకు అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే. మహబూబాబాద్ జిల్లాలో ఓ గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లు తాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది. మహబూబాబాద్ మండలంలోని వేంనూరు గ్రామంలో ఓ తాగుబోతు కోతి, తమకు జీవనాధార మైన తాటి కల్లును తాగుతూ ఉపాధి లేకుండా చేస్తోందని ఆవేదన చెందుతున్నాడు.

ఫలితం లేదు..

ఫలితం లేదు..

ఆ కోతి ఎంత బెదిరించినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నాడు. ఏం చేయాలో అర్ధం కావడం లేదని గౌడ్ గుట్టయ్య అన్నాడు. వేంనూరు గ్రామంలో నలమాస గుట్టయ్య గౌడ్ వృత్తి రీత్యా కల్లు గీత కార్మికుడు. తన కున్న తాటి చెట్లను ఎక్కుతూ కల్లు అమ్ముకుంటూ వచ్చిన రూ. 200, 300 వందలతో జీవనం సాగించేవాడు. గత కొన్ని రోజులుగా గుట్టయ్య‌కు ఓ కోతి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

కల్లుకు రుచి మరిగిన వానరం

కల్లుకు రుచి మరిగిన వానరం


కల్లుకు రుచి మరిగిన కోతి ఉదయం, సాయంత్రం అదేపనిగా చెట్టు ఎక్కి కల్లు తాగుతు అక్కడక్కడే చెట్ల మీద తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది. రోజు కల్లు కుండలు నిండే సమయానికి ఆ చెట్లు ఎక్కి కల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తోందట. కోతి ఎంజాయ్ పక్కన పెడితే పాపం గౌడన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. చెట్టుపై కోతి కల్లు తాగుతున్న విషయం ఊరంతా పాకడంతో పాపం గుట్టయ్యకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ తాగుబోతు కోతి వల్ల జీవితం ఆగమై పోతోందనే ఆవేదనలో ఉన్నాడు.

Recommended Video

Monkey Viral Video : మనుషుల కంటే కోతి లైఫ్ బాగుంది | Summer Effect || Oneindia Telugu
ఫూటుగా తాగుతూ

ఫూటుగా తాగుతూ


ఆ కోతి మంచిగా కల్లు తాగుతుంది.. మరీ గౌడ్ పరిస్థితి ఏంటీ.. వచ్చే కనీస ఆదాయం కోల్పోతున్నాడు. తమ కుటుంబం పరిస్థితి ఏంటీ అని ఆందోళన చెందుతున్నాడు. కల్లుకు రుచి మరిగిన కోతి.. రోజు తాగడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఒకవేళ కోతిని తరిమినా.. కోతులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అతను కిమ్మనకుండా ఉన్నాడు. కానీ ఆ కోతి మాత్రం.. గుట్టయ్యను కూర్చొనీయడం లేదు.. నిల్చొనీయడం లేదు.

English summary
a monkey drink palm water. goud guttaiah feared. incident happen at mahabubabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X