వరంగల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ .. క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో ఒక విద్యార్థి మృతి

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట లో బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం వద్ద ఉన్న బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నిన్న అర్ధరాత్రి సమయంలో నర్సంపేట బిట్స్ కళాశాలలో నలుగురు స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం ముదిరి పెట్టు గొడవకు కారణమైంది. ముఖ్యంగా ఇద్దరు విద్యార్థుల మధ్య పెద్దదైన ఘర్షణలో ఓ విద్యార్థి క్షణికావేశంలో హాస్టల్ భవనం పై నుండి మరో విద్యార్థిని కిందకి తోసేశాడు. ఇక భవనం పై నుండి కింద పడిన విద్యార్థిని వరంగల్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ నకీర్త సంజయ్ అనే 18 సంవత్సరాల విద్యార్థి మరణించాడు.

 A student died after being thrown from bits college building in a clash between two students

మృతుడు నకీర్త సంజయ్ కమలాపురం మండలం వంగపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గా చెప్తున్నారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించడానికి నిరాకరించారు. విద్యార్థుల మధ్య గొడవ కారణంగా బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుండి క్రింద పడ్డాడని చెప్తున్నారు. అసలు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఏంటో ఇప్పటి వరకు బయటకు రాలేదు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడిగే అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

బాగా చదువుకుని చేతికందివస్తాడు అనుకున్న కొడుకు ఊహించని విధంగా మరణించడంతో విద్యార్థి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకునేంతగా గొడవ పడుతుంటే కళాశాల యాజమాన్యం ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. బిల్డింగ్ పై నుండి క్రిందకి తోసేసిన విద్యార్థి క్షణికావేశమే సంజయ్ ప్రాణాలు పోవడానికి కారణమని మిగతా విద్యార్థులు అంటున్నారు. క్షణికావేశంతో సంజయ్ ను భవనం మీద నుండి క్రిందికి తోసిన విద్యార్ధి భవిష్యత్ ప్రశ్నార్ధకం కాగా, సంజయ్ ప్రాణాలే పోగొట్టుకోవటం ఇద్దరు విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదానికి కారణం అయ్యాయి.

Recommended Video

    పాఠశాలల్లో అమ్మాయిల కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ సుజాత

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+