• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్రమాస్తుల కేసులో ఏఎస్సై మోహన్‌రెడ్డి అరెస్టు

|

కరీంనగర్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అక్రమ వడ్డీ వ్యాపారం కేసు నిందితుడైన ఏఎస్సై మోహన్‌రెడ్డిని అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించి కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టారని ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

ఐదు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసిన అధికారులకు.. అక్రమాస్తులకు సంబంధించిన దస్త్రాలు లభించాయి. మోహన్‌రెడ్డి, ఆయన భార్య, తమ్ముడి పేరిట సుమారు 1.86 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. దీంతో మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన అధికారులు సోమవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఆయనను ఏప్రిల్ 24 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి.భాస్కర్‌రావు ఆదేశాలు జారీచేశారు. దీంతో రిమాండ్‌కు కరీంనగర్‌ జైలుకు తరలించారు. ప్రైవేటు పాఠశాల ఛైర్మన్‌ ప్రసాదరావు ఆత్మహత్య, అక్రమ వడ్డీ వ్యాపారంలో ఇప్పటివరకు రెండు సార్లు మోహన్‌రెడ్డి అరెస్టు కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కావడం ఇది మూడోసారి.

ACB arrests tainted ASI Mohan Reddy

ఐదుగురి కోసం ముమ్మర గాలింపు

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట అటవీ ప్రాంతంలో జరిగిన దుప్పుల వేట, తుపాకీతో అటవీశాఖ అధికారులను బెదిరించిన సంఘటనల్లో మిగిలిన ఐదుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఏ ప్రాంతంలో ఉన్నారో పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ముగ్గురి ఆచూకీ పోలీసులకు కష్టతరంగా మారినట్లు సమాచారం.

న్యాయస్థానం అనుమతి కోరిన అటవీశాఖ:

అక్భర్‌ఖాన్‌, నెన్నల గట్టయ్య, మున్నా, ఫైజల్‌ మహ్మద్‌ ఖాన్‌లను విచారించేందుకు అటవీశాఖ న్యాయస్థానం అనుమతి కోరింది. దీనికి సంబంధించి సోమవారం మంథని న్యాయస్థానంలో అటవీశాఖ పత్రాలను దాఖలు చేసింది.

ఠాణాలో వాహనాలు..?: దుప్పులవేట ఘటనలో ఉపయోగించిన వాహనాలనుమహదేవపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ వాహనాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వీటిని మహదేవపూర్‌ ఠాణాకు తీసుకుని వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీస్‌ అధికారులను సంప్రదించగా ధ్రువీకరించ లేదు.

వేధింపులతో భర్త ఆత్మహత్య: భార్య ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: వేధింపుతో భర్త ఆత్మహత్యకు పాల్పడగా భార్య పురుగుల మందు తాగింది. ఈ సంఘటన 57వ డివిజన్‌ పరిధిలోని హన్మకొండ మండలం పలివేల్పుల గ్రామంలోని ఆనందనగర్‌ కాలనీలో సోమవారం జరిగింది. కేయూసీ ఇన్‌స్పెక్టర్‌ కథనం ప్రకారం.. హన్మకొండ మండలం పలివేల్పులకు చెందిన రత్న సత్యనారాయణరెడ్డి( 66)ని అతని కుటుంబ సభ్యులు, బంధువులు గత కొంతకాలంగా డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

సోమవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయాన్ని పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుగు పొరుగు వారు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోగానే అతడు మృతిచెందాడు. దీన్ని జీర్ణించుకలోని అతని భార్య తిరుపతమ్మ(65) కూడా కాసేపటికి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు ఎలాంటి ప్రాణాప్రాయంం లేదని సీఐ చెప్పారు. సత్యనారాయణరెడ్డి ఆత్మహత్యకు బాధ్యులైన ఎం.శ్రీదేవి, శివకుమార్‌, ఆర్‌.శ్రీదేవి, వనితతో పాటు మరో ఇద్దరిపై కేసును నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

తండ్రీ కొడుకుల్ని మింగిన లారీ

జనగామ: జనగామ జిల్లా జనగామలోని ప్రిస్టన్‌ ఎదుట సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానిక సీఐ ముసికె శ్రీనివాస్‌, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఎం.డి.సర్ధార్‌(44), ఆయన కుమారుడు తౌషిక్‌బాబా(10)తో కలిసి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ ద్విచక్ర వాహనంపై జనగామకు వచ్చాడు.

తన మేనమామ అయిన గౌస్‌ పాషా ఇంటికి అంబేడ్కర్‌నగర్‌కు వెళ్లి, తిరిగి బస్టాండ్‌ వైపు వస్తుండగా హన్మకొండ నుంచి బస్టాండ్‌ వైపు వేగంగా వస్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సర్థార్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తౌషిక్‌బాబాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాలున్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు.

సర్థార్‌ రఘునాధపల్లి మండలం బానాజీపేట పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తౌషిక్‌బాబా జనగామలోని ఎస్పీఆర్‌ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి తచదువుతున్నాడు. సర్దార్‌కు భార్య సఫియాబేగం, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సర్దార్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

తొర్రూరులో మహిళ దారుణ హత్య

తొర్రూరు: తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌ సమీపంలో సింగిరికొండ వనజ(45) అనే మహిళ దారుణ హత్యకు గురవగా సోమవారం వెలుగు చూసినట్లు తొర్రూరు సీఐ వి. చేరాలు, ఎస్సై రమణమూర్తి తెలిపారు. సిఐ, ఎస్సై వివరాల ప్రకారం... వనజకు శనివారం రాత్రి నుంచి కుమారులు ఫోన్‌ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో ఆదివారం సైతం ప్రయత్నించారన్నారు.

అయినప్పటికీ సమాధానం లభించకపోవడతో సమీపంలో ఇంటి వారికి ఫోన్‌ చేసి అమ్మతో మ్లాడించాలని కోరగా ఇంటి వద్దకు చేరుకోగా వనజ చనిపోయిన రక్తపు మడుగులో ఉండటం చూసి కుమారులతోపాటు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. దీంతో సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా రెండు రోజుల క్రితం వనజ మృతి చెందినట్లు భావిస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.

కుటుంబసభ్యుల అనుమానం మేరకు గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేశారని కుమారులు గౌరీశంకర్‌, గురుప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డాగ్‌ స్వ్కాడ్‌, క్లూస్‌ టీంతో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, 20 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో వనజ చిరు వ్యాపారాలు కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sleuths of the Anti-Corruption Bureau (ACB) arrested tainted cop and suspended ASI B Mohan Reddy on the charge of possessing properties disproportionate to his known sources of income and remanded him in judicial custody on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more