Akhanda 2: అఖండ-2 ఎఫెక్ట్..! టికెట్ రేట్లపై తేల్చేసిన కోమటిరెడ్డి....!
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2కు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ పోటీ పడి టికెట్ రేట్ల పెంపుకు అంగీకరించాయి. తెలంగాణలో గతంలో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచేది లేదని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా అఖండ 2 విషయంలో మాత్రం యూటర్న్ తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడం, దీనిపై ఈ నెల 14 వరకూ స్టే ఇవ్వడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఇవాళ సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని ఆయన ప్రకటించారు. టికెట్ రేట్ల పెంపు కోసం వినతులతో నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దని సూచించారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలన్నారు. వాస్తవానికి టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని ఆయన గుర్తుచేశారు. అయితే ఈసారి పొరపాటు జరిగిందంటూ అఖండ 2 టికెట్ రేట్ల పెంపు అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు. దీనిపై ప్రస్తుతం వివాదం ఏర్పడి హైకోర్టు వరకూ చేరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో టికెట్ రేట్ల పెంచకూడదని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ పెద్దలు వచ్చి కలిసినా సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ ఈసారి బాలకృష్ణ సినిమా అఖండ 2కు మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి సై అనేశారు. కానీ తెలంగాణలో ఉన్న పాలసీకి వ్యతిరేేకంగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. ఓవైపు అఖండ 2 సినిమా చివరినిమిషంలో విడుదల కాకుండా వాయిదా పడటంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించి మరీ ఇచ్చారు. అయినా హైకోర్టు నిర్ణయంతో అఖండ నిర్మాతలతో పాటు ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ప్రభుత్వం ఈసారి టికెట్ రేట్లు పెంచరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications