హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ మేనిఫెస్టో విడుదల: వందల కోట్లతో మునుగోడు అభివృద్ధి, టార్గెట్ 500డేస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మునుగోడు అభివృద్ధి కోసమే బీజేపీ మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపింది. 500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

కేంద్ర నేతలతో మాట్లాడి ఈ హామీలు ఇస్తున్నట్లు వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి. రూ. 200 కోట్ల కేంద్ర నిధులతో రోడ్ల అభివృద్ధి, సంస్థాన్ నారాయణపురంలో టెక్స్ టైల్ పార్కు, మునుగోడులో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం, 25 కోట్లతో చౌటుప్పల్ ఐటీఐ అభివృద్ధి, 100కోట్లతో మూసీ నీళ్లను ఎత్తిపోసి చెరువులను నింపే కార్యక్రమం సహా వివిధ అంశాలను ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చడం గమనార్హం.

తెలంగాణకు బీజేపీనే శ్రీరామ రక్ష... రాష్ట్రం బాగుపడాలంటే... బీజేపీ వల్లే సాధ్యం. కనీసం రోడ్లు వేయిద్దామన్నా.. కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తాం. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

BJP manifesto released for Munugode bypoll

చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, చౌటుప్పల్‌లో రూ. 25 కోట్లతో ఐటీఐ ఏర్పాటు చేస్తాం. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడులో సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మర్రిగూడలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్‌లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి.

మరోవైపు, మునుగోడు అభ్యర్థి కేంద్ర పథకాలకు ప్రాంతీయ పార్టీలు వాళ్ల లేబుల్స్ వేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనేది ప్రధాని నరేంద్ర మోడీ నినాదమన్నారు. సొమ్ము ప్రజలది, సోకు కేసీఆర్‌ది అన్నట్లుందని ఎద్దేవా చేశారు ఈటల. మునుగోడులో కేసీఆర్‌ ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్లు భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఒక్కరిపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు.

English summary
BJP manifesto released for Munugode bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X