కుట్రా? నిర్లక్ష్యమా?: సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండిపోయింది!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా హరితహారం పేరుతో కోట్లాదిగా మొక్కలు నాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్ స్వయంగా నాటిన మొక్క మాత్రం ఎండిపోయి, వాడిపోయవడం గమనార్హం. అయితే, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది.

ఎండిపోయిన కేసీఆర్ నాటిన మొక్క

ఎండిపోయిన కేసీఆర్ నాటిన మొక్క

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా మానేర్‌ కట్ట దిగువన సీఎం స్వయంగా నాటిన ‘మహాఘని' మొక్క ఎండిపోయి, వాడిపోయింది. ఈ విషయం మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు మొక్కను బతికించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

కుట్రేనా?

కుట్రేనా?

అయితే, కొందరు యువకులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బల్దియా కాపాలాదారు చెబుతున్నారు. సెప్టెంబర్ 9న రాత్రి పది గంటల తర్వాత ఆటోలపై ఐదారుగురు యువకులు మద్యం తాగి వచ్చి.. ఈ మొక్క దగ్గర నిలబడి ఏదో చేస్తున్నట్లు అనిపించిందని, వెళ్లి ప్రశ్నించగా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని తెలిపారు.

నానా తంటాలు

నానా తంటాలు

ఈ విషయాన్ని వెంటనే బల్దియా పర్యవేక్షకునికి తెలిపానని చెప్పారు. ఆ రోజు నుంచి క్రమంగా మొక్క వాడిపోవడం మొదలైందని తెలిపారు. నగర పాలకసంస్థ కమిషనర్‌, హరితహారం ప్రత్యేక అధికారి, అటవీశాఖ అధికారి వచ్చి చూసి, మొక్కను బతికించేందుకు నానా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

 మిగితా వాటి పరిస్థితేంటి?

మిగితా వాటి పరిస్థితేంటి?

కాగా, సీఎం నాటిన మొక్క పరిస్థితే ఇలావుంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన ఇతర మొక్కల పరిస్థితేలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మొక్కలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Arya Vysya leaders demand arrest of Kancha Ilaiahఅరెస్ట్ చేయాలని ఆర్యవైశ్య డిమాండ్ | Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandrasekhar Rao Sapling Tree Goes Dry in Karimnagar due To Officials Negligence.
Please Wait while comments are loading...