వేల వాట్సప్ గ్రూపులలో డేంజరస్ ఏపీకే ఫైల్స్.. మీ వాట్సప్ సేఫేనా?
సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా whatsapp గ్రూప్ లను టార్గెట్ చేసి ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారు. పొరపాటున ఆ ఫైల్ ఓపెన్ చేస్తే అంతే సంగతి.. మీ మొబైల్ లోకి చొరబడి మీ వ్యక్తిగత ఖాతాను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాలను చోరీ చేస్తున్నారు.
వాట్సప్ గ్రూపులలో అలజడి రేపుతున్న ఏపీకే ఫైల్స్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక whatsapp గ్రూప్ లలో ఏపీకే ఫైల్స్ వైరల్ గా మారాయి. ఆధార్ తో సహా ఇతర ఈకేవైసీ వివరాలు అప్డేట్ చేయని కారణంగా మీ బ్యాంకుఖాతా ఈరోజు రాత్రినుండి బ్లాక్ చేయబడుతుందని, దయచేసి క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వివరాలను అప్లోడ్ చేయాలని టీం ఎస్బిఐ పేరుతో వాట్సాప్ గ్రూపులలో ఏపీకే ఫైల్స్ చెక్కర్లు కొట్టాయి.

మంత్రులు, మీడియా గ్రూపులలోనూ హల్చల్ చేసిన ఏపీకే ఫైల్స్
ఎస్బిఐ ఖాతాదారులు చాలామంది ఆ లింకును క్లిక్ చేశారు అంతే ఆ క్షణం నుంచి వారి ఫోన్లు సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్ళాయి. ఇక వారి whatsapp గ్రూపుల నుండి ఇతర whatsapp గ్రూప్ లకు ఏపీకే ఫైల్స్ వ్యాపించాయి ఇలా వేలాది ఫోన్స్ కు ఏపీకే ఫైల్స్ చేరడం, తెలంగాణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్న గ్రూపులలో కూడా హల్చల్ చేయడం కనిపించింది.
ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు అలర్ట్
ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు అలర్ట్ ఇస్తున్నారు. పొరపాటున ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మొదటి ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేసి సెట్టింగ్స్ లో ఉన్న యాప్స్ లోకి వెళ్లి ఆ ఏపీకే యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలని ఆపైన యాంటీవైరస్ యాప్ తో ఫోన్ ను ఫుల్ స్కాన్ చేయాలని చెబుతున్నారు.
మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకపోతే ఇలా చెయ్యాలి
అంతేకాదు బ్యాంకింగ్ యాప్ లు, సామాజిక మధ్యమ ఖాతాలు, ఇమెయిల్ ఖాతాలో పాస్వర్డ్ లను కూడా తక్షణమే మార్చాలని ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయేమో పరిశీలించాలని సూచిస్తున్నారు. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకపోతే మొబైల్ ను సేఫ్ మోడల్ రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు.
డేటా బ్యాకప్.. ఫ్యాక్టరీ రీ సెట్ చేసుకుంటే సేఫ్
ఫోన్లో ఇంకా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమమని, ఏదైనా మోసపోయినట్టు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతాను స్తంభింప చేయాలని చెబుతున్నారు. 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కూడా సూచిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications