మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్!
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తాజాగా సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పులు
పక్కా సమాచారంతో దాడులుచేసిన ఈగల్ టీమ్ వారిని పట్టుకునే క్రమంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులను భయపెట్టడానికి పోలీసులు రాగానే నమిద్ మిశ్రా ఫైరింగ్ జరిపారు. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు నమిద్ మిశ్రా. ఈగల్ టీం వీరిని పట్టుకొని ఫామ్ హౌస్ లోపల కొకైన్, ఖరీదైన మద్యం బాటిల్స్ తో పాటు, హుక్క పైప్స్ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ టెస్ట్ లో టీడీపీ ఎంపీకి పాజిటివ్
అయితే డ్రగ్స్ టెస్టులో పార్టీలో పట్టుబడిన ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్ తెలిపారు. మొదట డ్రగ్స్ టెస్టులో టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కి నెగిటివ్ వచ్చినట్టుగా వెల్లడించారు. అయితే తాజాగా మరో మారు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు జరిపిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది.
యూరిన్ టెస్ట్ లో నెగటివ్, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్
నిన్న యూరిన్ టెస్ట్ లో నెగటివ్ రాగా, యూరిన్ శాంపిల్ లో నీళ్లు కలిపినట్టు అధికారులు గుర్తించారు.అందుకే మరో మారు బ్లడ్ టెస్ట్ చేయగా టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తులో టిడిపి ఎంపీ తోపాటు ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో వీకెండ్ పార్టీ
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో టిడిపి ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి లకు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. ఈ వీకెండ్ పార్టీలో వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications