వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జంగా యాక్టివ్: ఎర్రబెల్లికి చిక్కులు, కెసిఆర్‌ చెంతకు పంచాయితీ

పాలకుర్తి రాజకీయాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రతిష్టంభనకు దారితీశాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, జంగా రాఘవరెడ్డికి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : పాలకుర్తి రాజకీయాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రతిష్టంభనకు దారితీశాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డికి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఇరువురు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.

రాజకీయ ఒత్తిళ్లతో డీసీసీబీ పాలకమండలి నిర్ణయాలు అమలు కాని పరిస్థితు నెలకొన్నాయి. పాకమండలి చేసిన నిర్ణయాయలను అమలు చేస్తే తదుపరి తమకు ఎలాంటి గడ్డు సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో బ్యాంకు సిబ్బందికి సంకట పరిస్థితి ఏర్పడిరది.

ఇందుకు పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. 2019 ఎన్నిక దృష్టితో పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి ప్రతిరోజు సుడిగాలి పర్యటనుచేస్తూ ప్రజకు చేరువయ్యాడు.

ఎర్రబెల్లి ఇలా..

ఎర్రబెల్లి ఇలా..


రాఘవరెడ్డి ఫలానా గ్రామానికి వెళ్లిండని తెలియగానే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ గ్రామానికి వెళ్లడం, దయాకర్‌రావు ఫలానా గ్రామానికి వెళ్లిండని తెలియగానే రాఘవరెడ్డి వెళ్లడం జరుగుతుంది. జంగా రాఘవరెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ హోదా ఉండడం వల్లనే ప్రజ మధ్యన తిరుగుతున్నాడని భావించిన ఎమ్మెల్యే దయాకర్‌రావు డీసీసీబీపై ప్రత్యేక దృష్టి సారించారు.

కెసిఆర్‌కు ఫిర్యాదు...

కెసిఆర్‌కు ఫిర్యాదు...

డీసీసీబీలో జంగా రాఘవరెడ్డి నిధుల దుర్వినియోగానికి ప్పాడ్డాడని, డీసీసీబీలో ఉద్యోగుల నియామకాలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్యతో కలిసి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే సహకార శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు టిఎస్‌కాబ్‌కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే 2017 ఏప్రిల్‌ మాసాంతంలో డీసీసీబీ పాలకమండలిని రద్దు చేసినట్లు ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌కు డీసీసీబీ ప్రత్యేకాధికారి బాధ్యతను అప్పగించారు.

పాలకవర్గం రద్దుపై హైకోర్టు స్టే

పాలకవర్గం రద్దుపై హైకోర్టు స్టే

ఏప్రిల్‌ మాసంలో డీసీసీబీని రద్దు చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం, నోటీసు ఇవ్వకుండానే పాలకవర్గాన్ని రద్దు చేశారంటూ జంగారాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మే నెలలో వేసవి సెవు ఉండడంతో జూన్‌లో హైకోర్టు ప్రారంభమైన కొద్ది రోజులకు పాలకవర్గం రద్దుపై స్టే ఇస్తూ మద్యంతర ఉత్తర్వును జారీ చేసింది. సహకార శాఖ ప్రత్యేక విచారణ అధికారిని నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది.

తప్పు పట్టిన హైకోర్టు..

తప్పు పట్టిన హైకోర్టు..

డీసీసీబీ పాలక మండలి ఆధ్వర్యంలో నియమించిన 26 మంది అటెండర్ల నియామకాన్ని సహకార శాఖ తప్పుపట్టింది. వారిని విధులనుంచి తొలగించారు. ఈ నియామకాలో, డీసీసీబీలో జరిగిన అక్రమాల్లో నలుగురు అధికారులకు ప్రమేయం ఉందంటూ వారిని జీఎం సహా నలుగురు ఉద్యోగును సస్పెండ్‌ చేశారు. సహకార శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడతోపాటు తొలగించిన 25 మంఇ ఉద్యోగును తిరిగి విధుల్లో చేర్చుకోవాలని తీర్పునిచ్చింది. అలాగే సస్పెండ్‌ చేసిన నలుగురు ఉద్యోగులను సస్పెన్షన్‌ను రద్దు చేసి విధుల్లో చేర్చుకున్నారు.

వందేళ్ల సంబురాలపై నీలినీడలు

వందేళ్ల సంబురాలపై నీలినీడలు

డీసీసీబీ ఏర్పాటు అయి వంద సంవత్సరాలు పూర్తి అయింది. ఆగస్టు 28న మొదట సంబురాలను నిర్వహించాలని పాలకవర్గంలో తీర్మానం చేశారు. 28 నుండి 29న నిర్వహించనున్నట్లు తెపారు. అదే విధంగా వందేళ్ల సందర్భంగా బ్యాంకు నుంచి పంట రుణం కింద రైతుకు రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వాలని, ఇందులో లక్ష రూపాయలను వడ్డీలేకుండా ఇవ్వాలని, మరో క్ష రూపాయలను 25 పైస వడ్డీపై ఇవ్వాలని పాకవర్గం తీర్మానం చేసింది. వందేళ్ల వేడుకలో దీనిని ప్రారంభించాలని నిర్ణయం చేసినప్పటికీ డీసీసీబీపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో వందేళ్ల వేడుకలను తాత్కాలికంగా నిలిపి వేశారు. డీసీసీబీ పాలక మండలి తీర్మానం చేసిన రైతుకు రెండు లక్షల రూపాయల రుణ పంపిణీ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని రాజకీయ ఆధిపత్య పోరు డీసీసీబీ పాలక మండలిపై పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

English summary
Telangana Rastra Samithi(TRS) MLA Errabelli Dayakar Rao is facing trouble with Janga Raghava Rddy at Palakurthi in Warangal district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X