కేసీఆర్ అహంకారం దించడానికి ప్రజాస్వామికంగా కొట్లడుతం.!టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదన్న ఈటల.!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంజలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా తమిళనాడు టూర్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాఖ్యలపై హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయాలని ఎవరు కుట్ర చెయ్యరని, ఈ విషయంలో బీజేపీ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని అన్నారు. చంద్రశేఖర్ రావు అహంకారం దించడానికి కూడా ప్రజాస్వామికంగానే కొట్లాడతామని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటల రాజేందర్. ప్రజలు తలుచు కుంటే పార్టీలు కనుమరుగు అవుతాయి తప్ప, పార్టీలను మింగుతా అంటే సాధ్యం కాదని ఈటల రాజేందర్ తెలిపారు. చంద్రశేఖర్ రావు కూడా టీడీపీ, కాంగ్రెస్ లను మింగేయాలని చూసారని, తనకు ఎదురులేకుండా చేయాలని చూశారని కానీ పరిస్తితులు తిరగబడ్డాయని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరికి వారు చంద్రశేఖర్ రావును ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటల రాజేందర్.

ప్రాంతీయ పార్టీలను బీజేపీ మింగే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యదని, బీజేపి సిద్దాంతాలు కూడా అవి కావని అన్నారు. కానీ ప్రాంతీయ పార్టీ ముసుగులో కుటుంబ పాలనకు పాల్పడినా, సొంత జాగీరులా భావించి, ప్రజా ధనానికి, ప్రజల ప్రాణాలకు రక్షణ గా నిలవాల్సిన ప్రభుత్వాలు వేదింపుకు గురి చేస్తే మాత్రం ప్రజలు ఆ ప్రాంతీయ పార్టీలను పాతరేస్తారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశమంతా చూసిందని, ప్రభుత్వం ఇక్కడి వారిని వేధించిన తీరు చూసారని, దానిని ఎదుర్కొనేందుకు మానవ ప్రయత్నం చేస్తూనే, దేవుళ్ళను కూడా చంద్రశేఖర్ రావు అహంకారం ఒడిపోవాలి అని చాలామంది మొక్కుకున్నారని అన్నారు. మొక్కులు చెల్లించడానికి ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారని, మంచిర్యాల నుండి శబరిమల వరకు, హుజూరాబాద్ నుండి తిరుమలకు పాదయాత్ర చేశారని, గుళ్ళు, దేవాలయాలు అన్నిటిలో పూజలు చేస్తున్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications