వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిమిలేయర్‌తో ఇబ్బంది లేదు, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు: ఘంటా చక్రపాణి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే పెద్దదని దాని ఛైర్మన్ ఘంటా చక్రపాని అన్నారు. కమిషన్ ఏర్పాటైన నాలుగు నెలల్లోనే 9 పరీక్షలు నిర్వహించామని, అన్నీ ఆధునిక పద్దతుల్లో నిర్వహించామని ఆయన తెలిపారు.

సాంకేతికతకు అందిపుచ్చుకోవడంలో మనమే ముందున్నామని, అందుకే మనకు రెండు అవార్డులు సైతం లభించాయని ఘంటా వెల్లడించారు. మొదటి సారిగా తెలంగాణలో ఆన్‌లైన్ పద్దతిలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులను తొలగించామని చెప్పారు.

 Ghanta Chakrapani on Creamy layer

ఫిబ్రవరి 4,5 తేదీల్లో జాతీయస్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్ల సదస్సు జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చక్రపాణి పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతారని తెలిపారు.

డిఎస్సీ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఘంటా చక్రపాణి అన్నారు. ఇప్పటి నిబంధనలతో క్రిమిలేయర్ వల్ల ఎవరికీ ఇబ్బందిలేదన్నారు. మిగితా అన్ని రాష్ట్రాలు క్రిమిలేయర్‌ను అమలు చేస్తున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికే బీసీ సంఘాలు క్రిమిలేయర్‌ను వ్యతిరేకిస్తున్నాయి.

English summary
TSPSC Chairman Ghanta Chakrapani on Monday responded on creamy layer issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X