ఈ దీపావళి జరుపుకోండి సేఫ్ గా.. టపాసులు కాల్చేటప్పుడు ఉండండి జాగ్రత్తగా!!

వెలుగుల పండుగ దీపావళిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. అయితే టపాసులను కాల్చే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. దీపావళి పండుగనాడు టపాసులు కాల్చే విషయంలో అజాగ్రత్తగా ఉండి ఎంతోమంది గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఒక్కోసారి దీపావళి టపాసుల వల్ల కళ్ళు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే దీపావళి కి బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకొని, సేఫ్ దీపావళి జరుపుకోవాలని, అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకోవాలని, గ్రీన్ క్రాకర్స్ ను కాల్చాలని సూచిస్తున్నారు .

దీపావళి టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త

దీపావళి టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త

దీపావళికి టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలలో భాగంగా ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన బాణాసంచా జోలికి వెళ్లొద్దు అని సూచిస్తున్నారు. బాణాసంచా కాల్చే సమయంలో వేసుకునే బట్టలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పట్టు బట్టలు, నైలాన్ వస్త్రాలు ధరించకూడదు అని, కాటన్ దుస్తులనే ధరించి బాణాసంచా కాల్చాలి అని చెబుతున్నారు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్ లు వేసుకోకూడదని అంటున్నారు. ఇక బాణాసంచా కాల్చే సమయంలో, వాటిని వెలిగించేటప్పుడు ముఖాన్ని దగ్గరగా పెట్టకూడదని సూచిస్తున్నారు.

బాణాసంచాతో ప్రయోగాలు చేయకండి

బాణాసంచాతో ప్రయోగాలు చేయకండి

పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండి జాగ్రత్తగా వారితో టపాసులను కాల్పించాలని సూచిస్తున్నారు. ప్రమాదకరమైన టపాసులను పిల్లలతో కాల్పించకూడదని చెబుతున్నారు. బాణాసంచాతో ప్రయోగాలు చేయకుండా ఉండాలని, కొన్నిసార్లు పేలని టపాసుల వద్దకు వెళ్లి పదేపదే వెళ్లి ముఖం పెట్టి చూడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బాగా పొగ వచ్చే టపాసులు కాల్చవద్దని సూచిస్తున్నారు. ప్రమాదకరమైన బాణాసంచా కాల్చడంతో ఆరోగ్యానికి హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. బాణాసంచా నుండి విడుదలయ్యే రసాయనాల కారణంగా ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ క్రాకర్స్ వాడండి

పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ క్రాకర్స్ వాడండి


ఇక బాణాసంచా కాల్చే సమయంలో బకెట్ తో నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి ఆరుబయట, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేని విధంగా బాణాసంచా కాల్చాలని సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు ఉన్న దగ్గర బాణాసంచా కాల్చకూడదని చెబుతున్నారు. టపాసులు కాల్చే సమయంలో పాదరక్షలు ధరించాలని చెబుతున్నారు. పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ క్రాకర్స్ ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఆసుపత్రులు, పెట్రోల్ బంకు సమీపంలో బాణాసంచా కాల్చడం మంచిది కాదని అంటున్నారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, సేఫ్, గ్రీన్ దీపావళి ని అందరూ ఘనంగా జరుపుకోవాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+