హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డా. శశికుమార్ ఆత్మహత్య: పోలీసులకు మిత్రుడి భార్య ఫిర్యాదు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉదయ్ అనే డాక్టర్‌పై కాల్పు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో అతని మృతదేహాన్ని కనుక్కున్నారు.

మొహినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. శశికుమార్ రివాల్వర్‌తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి అతను తనను తను కాల్చుకున్నాడు.

సోమవారం ఉదయ్ అనే డాక్టర్‌పై కాల్పులు జరిపి శశికుమార్ పారిపోయిన విషయం తెలిసిందే. శశికుమార్ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ సాయి, డాక్టర్ ఉదయ్ తనను మోసం చేశారని అతను సూసైడ్‌ నోట్‌లో రాశాడు. మాదాపూర్‌లో స్థాపించిన లారెల్ ఆస్పత్రి స్థాపన వారు తనను మోసం చేశారని అతను రాశాడు.

ఆస్పత్రికి పెట్టుబడి అంతా తానే పెట్టానని, వారిద్దరు ఒకరు సిఈవోగా, మరొకరు ఎండిగా అధికారం చెలాయిస్తూ తనను బోర్డు నుంచి తప్పించారని అతను రాశాడు. తన చావుకు సాయి, ఉదయ్ కారణమని అతను ఆరోపించాడు. తన వద్ద పనిచేసేవారే తనను మోసం చేశారని అన్నాడు. సోమవారంనాడు కారులో ప్రయాణిస్తున్న సమయంలో శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల నుంచి సాయి కుమార్ అనే డాక్టర్ తప్పించుకోగా, ఉదయ్ అనే డాక్టర్ గాయపడ్డాడు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శశికుమార్ స్నేహితుడి భార్య ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శశికుమార్ స్నేహితుడి భార్య చంద్రకళ ఫిర్యాదు చేశారు. శశికుమార్‌ను తానే ఫాం హౌస్ వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పారు. కాగా, తాను ఉదయ్ పైన కాల్పులు జరపలేదని, సాయి కాల్పులు జరిపి పారిపోయాడని, నేను భయపడి పారిపోయానని శశికుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.

 హైదరాబాదులో తుపాకీ మోత

హైదరాబాదులో తుపాకీ మోత

ముంబై తరహా కాల్పుల ఘటనలు హైదరాబాద్‌లోనూ జరుగుతున్నాయని సోమవారం చోటుచేసుకున్న ఉదంతం రుజువు చేస్తోంది.

 హైదరాబాదులో తుపాకీ మోత

హైదరాబాదులో తుపాకీ మోత

కార్పొరేటు ఆసుపత్రి ప్రారంభం, వాటాల పరంగా పొరపచ్చాలు రావడంతో డాక్టర్‌ ఉదయ్‌ని డాక్టర్‌ శశికిరణ్‌ తుపాకీతో కాల్చాడని అనుమానిస్తున్నారు.

హైదరాబాదులో తుపాకీ మోత

హైదరాబాదులో తుపాకీ మోత

ఉదయ్‌ ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నా, నగరంలో నేర సంస్కృతి పెరుగుతోందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌లో అక్రమాయుధాలు కలిగి ఉన్నట్లు వెలుగుచూస్తోంది.

 డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో సోమవారం సాయంత్రం ఓ కారులో కాల్పుల శబ్దం సమీపంలోని వారిని హడలెత్తించింది. ముగ్గురు వైద్యుల మధ్య ఘర్షణ కాల్పుల వరకూ వెళ్లింది.

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?


చైతన్యపురికి చెందిన సాయినికిత్‌ ఆసుపత్రి యజమాని, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ శశికుమార్‌, మాదాపూర్‌కు చెందిన డాక్టర్‌ రాచకొండ ఉదయ్ కుమార్‌, డాక్టర్‌ సాయి కుమార్‌లు మూడేళ్ల క్రితం మాదాపూర్‌లో రూ.15కోట్ల పెట్టుబడితో లారెల్‌ ఆసుపత్రిని ప్రారంభించాలనుకున్నారు.

 డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌ శశికుమార్‌ రూ.75 లక్షలు, ఉదయ్‌ రూ.3. కోట్లు, సాయి 2.9కోట్ల పెట్టుబడులు పెట్టారు. నిర్మాణం ఆలస్యమవడంతో ఎన్నారైల నుంచి అప్పు తీసుకుని జనవరి 1, 2016న ఆసుపత్రిని ప్రారంభించారు.

 డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌ ఉదయ్ కుమార్‌.. శశికుమార్‌కు చెప్పకుండా మరొకరికి భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన వాటా తీసుకోవాలని శశికుమార్‌ డిమాండ్‌ చేయడంతో ఉదయ్, సాయికుమార్‌లు అంగీకరించి సోమవారం మాట్లాడుకుందామనుకున్నారు. ముగ్గురూ హిమాయత్‌నగర్‌ వచ్చారు.

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

అక్కడ కొంతసేపు చర్చించుకున్నారు. జనం ఉండటంతో వారంతా ఒకే కారులో బయలుదేరి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌ ముందు ఆగారు.

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డ్రైవింగ్‌ సీటులో ఉదయ్‌ ఉండగా... పక్కనే సాయికుమార్‌, వెనుక శశికుమార్‌ కూర్చున్నారు. సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో శశి తన లైసెన్సు రివాల్వర్‌ పాయింట్‌ .32 ఎంఎంతో ఉదయ్‌పై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు.

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

తప్పించుకునే క్రమంలో ఎడమ చెవి వైపు గాయమైంది. సాయికుమార్‌, శశికుమార్‌లు పారిపోయారు. గాయంతోనే డాక్టర్‌ ఉదయ్‌ ఆటోలో వెళ్లి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

 డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

డాక్టర్‌పై కాల్పులు.. ఏం జరిగింది?

ఆసుపత్రి నిర్వహణ, లావాదేవీల్లో బేధాభిప్రాయాల కారణంగా ఈ ఘటన జరిగిందని డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. చైతన్యపురికి చెందిన శశికుమార్‌కు స్థానికంగా సాయినికిత్‌ ఆసుపత్రి ఉందని, ప్రస్తుతం సిగ్మా ఆసుపత్రిని కూడా లీజుకు తీసుకున్నారన్నారు. శశికిరణ్‌పై హత్యాయత్నం కేసుతోపాటు, ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ భీమ్‌రెడ్డి తెలిపారు. అయితే, మంగళవారం ఉదయానికి శశికుమార్ ఆత్మహత్య చేసుకోవడం, తాను కాల్పులు జరపలేదని చెప్పడం కొత్త పరిణామం.

English summary
Sashi Kumar, a doctor, who fired at aanother doctor Uday in Hyderabad, commited suicide in Moinabad of Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X