కరీంనగర్లో నయా దందా.. ఫస్ట్ ఇన్ స్టాలో ఫోటోలు.. ఆ తర్వాత ఏకంగా ఇంట్లో !
కరీంనగర్లో సంచలన హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దంపతులే కలిసి ప్లాన్ వేసి యువకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వలపువల విసిరి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన బాగోతం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోలు, ఆకర్షణీయమైన చిత్రాలు పోస్టు చేస్తూ బాధితులను వలలోకి లాగిన ఈ జంట, ఆ తర్వాత వారి జీవితాలను నరకంగా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు. గతంలో మార్బుల్ వ్యాపారం నిర్వహించిన వీరికి భారీ నష్టాలు రావడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేర మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఆరెపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరు, సోషల్ మీడియాలో యువతను ఆకర్షించేలా న్యూడ్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ పరిచయాలు పెంచుకున్నారు.

ఇన్‌స్టా ద్వారానే..
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన యువకులు, వ్యాపారులతో చాట్ చేస్తూ నమ్మకం పెంచుకున్న అనంతరం, వారిని ఇంటికి ఆహ్వానించేవారు. అక్కడ సన్నిహితంగా వ్యవహరిస్తూ రహస్యంగా న్యూడ్ వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి, వాటిని బయటపెడతామంటూ బెదిరింపులకు దిగేవారు. ఈ విధంగా సుమారు వందమందికి పైగా బాధితులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవహారం బయటపడడానికి కారణం ఓ బాధితుడి ధైర్యమేనని పోలీసులు తెలిపారు. ఆ బాధితుడు ఇప్పటికే ఈ దంపతులకు సుమారు రూ.12 లక్షలు చెల్లించగా, మరింతగా రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం వారి ఫోన్లను పరిశీలించగా, అనేక మంది బాధితులకు సంబంధించిన న్యూడ్ వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. బ్లాక్మెయిల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఈ దంపతులు ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయడంతో పాటు, లగ్జరీ కారు కూడా కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు వెల్లడైంది.
ఈ ఘటనతో సోషల్ మీడియా ద్వారా జరిగే హనీట్రాప్‌లు ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో సన్నిహితంగా మెలగడంలో జాగ్రత్త అవసరమని, వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications