శిరీష కేసులో శ్రవణే ఏ1 ఎందుకంటే..?: చంచల్‌గూడ జైలుకు నిందితులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లకు నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితులపై సెక్షన్ 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, నల్గొండ జిల్లా మాల్‌కు చెందిన శ్రవణ్ ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు వార్తా ఛానాళ్లలో ప్రసారమయ్యాయి. ఎస్సై పరీక్షలకు కోచింగ్ పేరుతో హైదరాబాద్‌లో ఉంటుండగా శిరీష, రాజీవ్‌లు ఇతనికి పరిచయమైనట్లు తెలిసింది. ఇక ఎస్సై ప్రభాకర్ రెడ్డితో నల్గండలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

శిరీషది ఆత్మహత్యే, అందుకే ప్రభాకర్ దగ్గరికి వెళ్లాం: ఏ1 శ్రవణ్ మాట ఇది

ఇరికించారు..

ఇరికించారు..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రవణ్.. శిరీష ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా కేసులో ఇరికించారని అన్నారు. ఆ రోజు రాత్రి శిరీష, రాజీవ్ మాత్రమే స్టూడియోకు వెళ్లారని చెప్పారు. శిరీష, రాజీవ్‌ల కేసు విషయంలోనే ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే.. తనను ఇరికించారని చెప్పుకొచ్చాడు. తప్పంతా రాజీవ్ దేనని అన్నాడు.

శ్రవణ్ ఏ1 ఎందుకంటే..

శ్రవణ్ ఏ1 ఎందుకంటే..

ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం శిరీష, రాజీవ్‌ను సోమవారం రాత్రి ప్రభాకర్ రెడ్డి వద్ద(కుకునూరుపల్లి)కి తీసుకెళ్లాడు శ్రవణ్. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి క్వార్టర్‌లోనూ అందరూ మద్యం సేవించారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి, శిరీషను గదిలో ఉంచి రాజీవ్‌ను తీసుకొని బయటికి వచ్చాడు శ్రవణ్. ఆమె కేకలు వేయడంతో మళ్లీ రాజీవ్, శ్రవణ్ లోపలికెళ్లారు. ఆ తర్వాత శిరీషను కొట్టాడు శ్రవణ్. దీంతో అక్కడ్నుంచి శిరీషను తీసుకెళ్లానని ప్రభాకర్ రెడ్డి కోరడంతో అక్కడ్నుంచి రాజీవ్, శిరీష, శ్రవణ్‌లు బయల్దేరార.

రాత్రిపూటే ఎందుకు వెళ్లారు?

రాత్రిపూటే ఎందుకు వెళ్లారు?

హైదరాబాద్ బయలుదేరిన తర్వాత కారులో కూడా శిరీషపై దాడి చేశాడు శ్రవణ్. అయితే, అంత రాత్రి పూట హైదరాబాద్ నుంచి కుకునూరుపల్లికి శిరీషను, రాజీవ్ ను తీసుకెళ్లాల్సిన అవసరం శ్రవణ్‌కు ఏంటీ అనే ప్రశ్నకు కూడా సమాధానం అతడ్నుంచి రావడం లేదు. శ్రవణ్.. ఉద్దేశపూర్వకంగానే ప్రభాకర్ రెడ్డి వద్దకు శిరీషను తీసుకెళ్లాడని పోలీసులు గుర్తించిన కారణంగానే అతడ్ని ఏ1గా నిందుడిగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అమ్మాయిల సప్లై, బ్లాక్ మెయిల్ యత్నం

అమ్మాయిల సప్లై, బ్లాక్ మెయిల్ యత్నం

రాజీవ్, శిరీషలను శ్రవణ్ బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. రాజీవ్ దగ్గర డబ్బు గుంజేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక, శ్రవణ్.. అమ్మాయిలను అధికారులు, ప్రముఖులకు ఎరగా వేసి తన పనులను చేయించుకుంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి అభియోగాలు శ్రవణ్ పై ఉన్నాయి. సీపీ మహేందర్ రెడ్డి కూడా శ్రవణ్ వ్యక్తిత్వం చాలా చెడ్డ(బ్యాడ్ క్యారెక్టర్)దని చెప్పడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nampally Court has imposed 14 days judicial remand for Shravan and Rajiv in Sirisha suicide case.
Please Wait while comments are loading...