Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీసీ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కవిత.. ఏకిపారేసిందిగా!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ టార్గెట్ చేశారు. గత ఐదు రోజులుగా హైదరాబాద్లో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు కావలసిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. హైదరాబాద్లో కోటికి పైగా ప్రజలు ఉన్నారని, గతంలో 7,500గా ఉన్న ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత 3500 కు తగ్గాయని కవిత పేర్కొన్నారు. దీంతో రవాణా కష్టమైందని చెప్పిన కవిత ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

kavitha targets cm revanth reddy over electric buses only for privatization of rtc

హైదరాబాద్ విశ్వనగరం ఇలా ఎలా అవుతుంది
సరైన రవాణా సౌకర్యాలు లేకపోతే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్లో వీధి కుక్కల బెడద, సిటిజన్ పోలీసింగ్ ఆవశ్యకత గురించి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల కొరతతో చెత్త పేరుకుపోవడాన్ని, సీతాఫల్ మండి పాఠశాల వద్ద సాంఘిక కార్యకలాపాలు కొనసాగడాన్ని కవిత ప్రస్తావించారు. నగరంలోని అనేక సమస్యలను ఏకరువు పెట్టారు.

ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చెయ్యాలని కోరిక
అంబర్ పేట, ముసరాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని, పాఠశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీరు అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష ఇండ్లు కడతామని చెప్పి 60000 ఇళ్ళు మాత్రమే కట్టారన్నారు.

సింగరేణి కష్టంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు
అందులో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని సింగరేణి కష్టంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం లేదని వాళ్ల ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. సింగరేణికి కాంగ్రెస్ పార్టీ వారి ఫండ్ నుంచి 10 కోట్ల రూపాయలు కట్టాలని కవిత డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+