ఫామ్‌హౌస్‌లో దుప్పటి ముసుగేసిన కేసీఆర్
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2009 సెప్టెంబరు వరకు ఫామ్ హౌస్ లో దుప్పటి ముసుగేసి పడుకున్న కేసీఆర్ వైఎస్ మరణం తర్వాతే దుప్పటి మడతేసి బయటకు వచ్చారు. తర్వాత తన చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 2023 నుంచి ఫామ్ హౌస్ లో దుప్పటి ముసుగుతన్ని పడుకున్నారు. ఏడాదికోసారి, ఆరు నెలలకోసారి దర్శనమిచ్చే దేవుడికి సంబంధించిన కొన్ని ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. ఆ తరహాలోనే పార్టీ నేతలకు, కార్యకర్తలకు దర్శనమిచ్చేవారు. అన్నింటికన్నా ఆయనకు మింగుడుపడని విషయం ఏమిటంటే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. అప్పటి నుంచి అసెంబ్లీకి రావడమే మానుకున్నారు.
ప్రజలపై చిత్తశుద్ధి ఏదీ?
తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చాలంటే ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం అవసరమైన నిధులను తీసుకురావాలి. కేసీఆర్ ఇవేమీ చేయడంలేదు అంటే.. అతనికి ప్రజలపై, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దాదాపు చచ్చిపోయిన స్థితిలో బీఆర్ఎస్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోవడంతో సొంత కూతురే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కామెంట్ చేసింది. జూబ్లీహిల్స్ లో ఇంతవరకు ఎప్పుడూ రాని మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు అనేదానికన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విజయం సాధించాడు అని చెప్పొచ్చు.

ప్రధాన పోరు ఆ రెండు పార్టీల మధ్యే
రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం బీఆర్ఎస్ ను బతకనీయడు అని కేసీఆర్ కు అర్థమైంది. అంతేకాదు.. బీజపీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారనే విషయాన్ని, కవితను అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని కేంద్ర పెద్దలు ముందుగానే కేసీఆర్ కు, కేటీఆర్ కు చెప్పారని, అయినా ఆడబిడ్డను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇటువంటివారు రాష్ట్రానికి, ప్రజలకు ఏమీ చేయలేరనే అభిప్రాయాన్ని రేవంత్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. వీటిని ప్రజలు కూడా నమ్మారు అనేదానికన్నా ఇది నిజమే కదా అని చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తుంది. మిత్రుడైనా, శత్రువైనా ఆ పార్టీకి ఒక్కటే. ఎన్నికల్లో గెలవాలనేదే వారి అజెండా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు కాంగ్రెస్-బీజేపీ మధ్యే జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విశ్లేషించుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications