రంగంలోకి కేసీఆర్.. పక్కా మాస్టర్ ప్లాన్ తో ఈసారి అసెంబ్లీలో రచ్చే!
తెలంగాణ రాజకీయాలలో ప్రతిపక్షమే లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని ఆలోచించేలా చేశాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని పదేపదే టార్గెట్ చేస్తున్న క్రమంలో తాజాగా కెసిఆర్ సుదీర్ఘ విరామం తర్వాత కీలక రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీకి కేసీఆర్
ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఈ వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతిపక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే కెసిఆర్ తన వాగ్ధాటితో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభలు
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాల వాటా విషయంలో కేంద్రం వివక్షను, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు ద్రోహం చేయడమేనని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందని కెసిఆర్ విమర్శలు గుప్పించారు.రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ తర్వాత భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు కెసిఆర్ ఆదేశించారు.
దక్షిణ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే ప్లాన్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల పైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న క్రమంలో దీనిపైన ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయొచ్చని ఆలోచిస్తున్నారు.
ఉద్యమ తరహాలో పోరాటం చెయ్యాలి అంటున్న కేసీఆర్
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ ఉద్యమ తరహాలో పోరాటాన్ని సాగించాలని, కేవలం విమర్శలకే పరిమితం కాకూడదని కెసిఆర్ చెబుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ రెండు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని అంటున్నారు.
తెలంగాణా ద్రోహుల అసలు రంగు బయటపెడతాం అంటున్న కేసీఆర్
కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతం కోసం కొట్లాడుతుంది అని ప్రజలకు తెలియజేసే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామని ఇటీవల కెసిఆర్ చేసిన హెచ్చరికలు రాబోయే రోజులలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి అన్న అభిప్రాయానికి కారణంగా మారాయి. ఇక కెసిఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణులలో కొత్త జవసత్వాలు నింపింది.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న క్రమంలో రాజకీయ వర్గాలలో ఆసక్తి
కొంతకాలంగా మౌనంగా ఉంటున్న పార్టీ శ్రేణులు కెసిఆర్ రంగంలోకి దిగుతున్న క్రమంలో మళ్లీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు.. ఇక అసెంబ్లీ తర్వాత నిర్వహించే సభలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా మళ్ళీ కెసిఆర్ రంగంలోకి దిగుతున్నాడు అన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications