కుట్రలు చేస్తున్నారు, హైకమాండే తేలుస్తుంది - ఈటల సంచలనం..!!
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించటం లేదు. ముఖ్య నేతల మధ్య పరోక్ష వార్ కంటిన్యూ అవుతోంది. పంచాయితీ ఎన్నికల వేళ తమ మద్దతు దారులను బరిలోకి దింపటం.. ఫలితాల పైన చేసిన పోస్టింగ్స్ వివాదాలకు కారణం అవుతున్నాయి. ఇక.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొందరు కుట్రలు చేస్తున్నారని.. హైకమాండే వారి సంగతి తేలుస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి.
తాజాగా బీజేపీకి చెందిన ఒక ముఖ్య నేత కార్యాలయ సిబ్బంది చేసిన సోషల్ మీడియా పోస్టింగ్స్ పైన వివాదం కొనసాగుతోంది. వీటి పైన తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. అవగాహన ఉన్నవారు అలా పోస్టులు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ అంశాలను బీజేపీ హై కమాండ్ తేలుస్తుందని.. సమయమే ఇది డిసైడ్ చేస్తుందని వ్యాఖ్యానిం చారు. తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని తెలి పారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ తాను చెబుతానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. సింగరేణిలో క్వార్టర్స్ బాగుచేయడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. సింగరేణి డబ్బులతో తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వందల కోట్లు ఖర్చు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోపిడి చేశారని కవిత ఆరోపిస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు. ఆరోపణలు వస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. తన స్వగ్రామం కమలాపూర్‌లో తనను తొక్కేయాలని చూశారని ఆరోపించారు. కొంత మంది తన గురించి మాట్లాడారని.. వాళ్లను ప్రజలు తొక్కేశారని విమర్శించారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications