పరీక్ష రాస్తూ ఎగ్జామ్ సెంటర్లోనే ప్రసవించిన మైనర్ బాలిక..!
సభ్యసమాజం సైతం అవాక్కయ్యే ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ తరహా ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మరొకటి జరిగింది. స్థానికంగా ఉన్న ఒక ఇంటర్ పరీక్షా కేంద్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు హాజరైన 16 ఏళ్ల విద్యార్థిని పరీక్ష సమయంలోనే బాత్రూమ్లో ప్రసవించిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
పరీక్ష మధ్యలో బాత్రూమ్కు వెళ్లిన విద్యార్థిని..
ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే, కడుపునొప్పి ఉందని చెప్పి విద్యార్థిని బాత్రూమ్కు వెళ్లింది. సుమారు అరగంట గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్ అనుమానం వ్యక్తం చేశారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి చూడగా, విద్యార్థిని తీవ్ర నీరసంతో బయటకు వస్తున్నట్లు గుర్తించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సిబ్బంది వెంటనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దీంతో సిబ్బంది ప్రశ్నించగా, తాను గర్భవతిని అని, నొప్పులు ఎక్కువగా రావడంతో బాత్రూమ్లోనే ప్రసవించానని బాలిక తెలిపినట్లు సమాచారం. లోపల పరిశీలించగా, బేసిన్లో మృత శిశువు కనిపించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, బాలికను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు.
పోలీసులు దర్యాప్తు..
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ అధికారిక ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే, విద్యార్థిని చదువుతున్న కళాశాల యాజమాన్యం ద్వారా ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అలానే వైద్యులు బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్సతో పాటు మానసిక పరమైన కౌన్సెలింగ్ కూడా అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ అధికారులను, తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాఠశాలలు, కాలేజీల్లో బాలికల ఆరోగ్య పరిస్థితులపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అవసరాన్ని ఇది గుర్తు చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications