IBomma రవికి మద్దతుగా ఎమ్మెల్సీ.. దమ్మున్నోడు అంటూ సజ్జనార్ కు సవాల్!
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిన పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో సామాన్యుల నుంచి రవికి మద్దతు లభిస్తోంది. టికెట్ల ధరలు విపరీతంగా పెంచిన సినిమా వాళ్ళు, సామాన్యులను సినిమాలు చూడనివ్వని పరిస్థితి తీసుకువస్తే రవి సామాన్యులు అందరికీ సినిమాను ఫ్రీగా చూపించాడని సాధారణ ప్రజలు రవికి మద్దతుని ఇస్తున్నారు.
సజ్జనార్ కు తీన్మార్ మల్లన్న సవాల్
తాజాగా రవికి రాజకీయవర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐ బొమ్మ రవి అరెస్టుపైన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు సవాల్ విసిరారు. ఐ బొమ్మ రవి దమ్మున్నోడు అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్న తీన్మార్ మల్లన్న వంద రూపాయల టికెట్లు వేలల్లో అమ్ముకునే సినిమావాళ్ళు ఏమన్నా సంసారులా? అంటూ ప్రశ్నించారు.

సజ్జనార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న
సీపీ సజ్జనార్ ను ఉద్దేశించి నిన్ను చూస్తే జాలేస్తుంది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.. పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్ళను పక్కన పెట్టుకొని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఐ బొమ్మ రవి గురించి అతని భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసుల ఆల్సేషన్ కుక్కలు కూడా అతనిని పట్టుకునేవి కాదని, ఇప్పటికైనా సజ్జనార్ రియాలిటీ లోకి రావాలని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
దమ్ముంటే అవి ఆపు.. సవాల్ చేసిన తీన్మార్ మల్లన్న
నువ్వు చేసేవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్ లేనని, వరంగల్‌లో కూడా చేసింది అదేనని ఆయన అన్నారు. నీకు దమ్ముంటే సైబర్ క్రైమ్ లను ఆపాలని సవాల్ విసిరారు. దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్న పిల్లవాడి కిడ్నాప్ జరుగుతుందని, అది అడ్డుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ మోసాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతున్నాయని దమ్ముంటే వాటిని ఆపి చూపించాలని తీన్మార్ మల్లన్న సజ్జనార్ కు సవాల్ విసిరారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వైరల్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వీడియో పైన నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మద్దతుగా ఉంటే, మరికొందరు సజ్జనార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఐ బొమ్మ రవి కి సపోర్ట్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications