కేరళను మించిన అందాలు.. హైదరాబాద్ నుంచి 50 కి. మీ. దూరంలోనే..
హెదరాబాద్ టెకీలకు అదిరిపోయే వార్త.. బిజీ లైఫ్ లో బోర్ కొట్టిందా..? వీకెండ్ లో సినిమాలతోనే గడిపేస్తున్నారా..? కేరళ, కొడైకెనాల్, అందాలను వీక్షించాలని ఉన్నా.. సమయం లేదని బాధపడుతున్నారా..? అయితే హైదరాబాద్ కు కేవలం 50 కి. మీ దూరంలోనే నర్సాపూర్ అర్బన్ పార్క్ ఇప్పుడు పర్యటకులను ఆకర్షిస్తోంది. 250 ఎకరాల పచ్చదనంతో నర్సాపూర్ అడవులు ఇప్పుడు నగరవాసులకు బెస్ట్ డెస్టినేషన్ గా మారింది. ఇక్కడి కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్, డైనింగ్ ప్రాంతాలు.. టూరిస్టూలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రైవేట్ రిసార్ట్స్ కు పోటీగా రాష్ట్ర ప్రభుత్వమే వీటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతోంది.
మెదట్ జిల్లాలోని నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఈ అర్బన్ పార్క్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు దగ్గరలో అప్పటి ప్రభుత్వం రూ. 13 కోట్లతో ఈ పార్క్ ను పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో అభివృద్ధి చేసింది. పర్యటకుల కోసం కాటేజీలు, రిసెప్షన్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ తదితర నిర్మాణాలను అప్పట్లోనే వేగవంతంగా నిర్మించారు. ఇక పార్కులో వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కు పెద్దలు, పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు మంచి పిక్నిక్ స్పాట్ గా మారింది.

హైదరాబాద్ కు నర్సాపూర్ అర్బన్ పార్క్ కేవలం 50 కి. మీ. దూరంలోనే ఉన్న క్రమంలో వీకెండ్ వచ్చిందంటే చాలు నగరవాసులు ఇక్కడికి వందల సంఖ్యలో వచ్చేస్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏడుపాయల వనదుర్గా ఆలయం, మెదక్ చర్చి ఉంటుంది. వీటిని కూడా టూరిస్టులు ఆస్వాదించవచ్చు. ఇక ఈ అర్బన్ పార్క్ లో రాత్రంతా బస చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక్కడే ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నుంచి వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. వ్యూ పాయింట్ నుంచి నర్సాపూర్ అటవీ ప్రాంతం మొత్తాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ అటవీ పార్కును మీరు కూడా సందర్శించండి..
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications