కబ్జాదారుల బండారం బయట పెట్టి తీరుతాం.!జైలు నుండి ఎన్ఎస్ యూఐ నేతల విడుదల.!
చర్లపల్లి/హైదరాబాద్ : రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తో సహా 12 మంది ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు కావడంతో వారు విడుదలయ్యారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ముందు మెరుపు ధర్నా నిర్వహించారు ఎన్ఎస్ యూఐ నేతలు. మల్లారెడ్డి హాస్పిటల్ ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ సారథ్యంలో ఎన్ఎస్ యూఐ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అదే రోజు రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించిన నాయకులను బుదవారం బెయిల్ పై విడుదల చేసారు.

ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు.. నిర్ధాక్షిణ్యంగా జైలుకు పంపినందుకు మూల్యం తప్పదన్న వెంకట్..
ఇదిలా ఉండగా 8వ తేదీన మేడ్చల్ మెజిస్ట్రేట్ విచారణ నిర్వహించిన అనంతరం, సెక్షన్ 447, 448, 452 ఐపీసీ మరియు, సెక్షన్ 5 ప్రకారం వైద్యులపై బౌతిక దాడులకు పాల్పడినందుకు, వైద్యకళా శాల వద్ద హింసాత్మక వాతావరణం సృష్టించినందుకు 2018 చట్టం ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ లో ఉన్న నాయకులను విచారణ నిమిత్తం మేజిస్ట్రేట్ ను దుండిగల్ పోలీసులు నిన్న 4 రోజుల కస్టడీ కోరగా వారు బుదవారం ఒక రోజు ఎన్ఎస్ యూఐ నాయకుల తరుపున అడ్వకేట్ సమక్షంలో కస్టడీ నిర్వహణకు అనుమతించడం జరిగింది.

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తప్పుడు కేసులా.. బండారం బహిర్గతం చేస్తానన్న ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఆ తర్వాత ఎన్ఎస్ యూఐ నాయకుల తరుపున అడ్వకేట్ వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూరితో సహా 12 మంది ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎన్ఎస్ యూఐ చేసిన పోరాటంతో మల్లారెడ్డి హాస్పిటల్ వార్త రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారడంతో తన మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యుల బృందంతో సూరారం చౌరస్తా వద్ద 300 పడకలతో ఉచిత కరోనా ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు మినిస్టర్ మల్లారెడ్డి ప్రకటించడం కొసమెరుపు.

ఒకేసారి 13మంది విడుదల.. తప్పుడు కేసులపై కార్యాచరణ ఉంటుందంటున్న ఎన్ఎస్ యూఐ
ఏది ఏమైనా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మరియు అతని బృందం చేసిన పోరాటం వల్ల తమకు ఉచిత ఐసొలేషన్ సెంటర్ వస్తుందని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. బుదవారం ఎన్ఎస్ యూఐ రాష్ట అద్యక్షుడు బలమూరి వెంకట్ తో పాటు 12 మందిని విడుదల చేసారు.
వెంకట్ బలమూరి, రితీష్ రావు రెగులపటి, గొల్ల జాన్, జీవన్ మన్నే, అరుణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పవన్, బిలల్, వినయ్ పటేల్, పృథిరాజ్, దీక్షిత్, గౌతం రావు మరియు రాకేష్ ముదిరాజ్ లు విడుదైలయ్యారు.
Recommended Video

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీ సర్కార్.. మండిపడ్డ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు తరలించారని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ బలమూరి మండిపడ్డారు. కరోనా నియమాలను పాటిస్తూ నిరసన తెలిపిన తమ పై తప్పుడు కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వెంకట్ స్పష్టం చేసారు. తాను ఒక ఎంబీబీఎస్ విద్యార్థిననీ, అంతే కాకుండా తనతో ఉన్న వారందరూ విద్యార్థులని కూడా చూడకుండా మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లపై దాడి చేశామని అక్రమంగా కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైలుకు తరలించారని, కేసులో ఉన్న లోపాలను అదే విధంగా దీని వెనక ఉన్న నాయకుల అక్రమ చిట్టాలను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేస్తానని వెంకట్ తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications