వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటు కాంగ్రెస్ - ఇటు సీఎం కేసీఆర్ తో : పీకే ఒప్పందం ఫిక్స్ - రోజంతా చర్చలు: సర్వే నివేదికలు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా మారిన ప్రశాంత్ కిషోర్ - కాంగ్రెస్ నేతల సమావేశాలపైన ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రోజంతా సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ మధ్య తెలంగాణ రాజకీయాలతో పాటుగా ..జాతీయ రాజకీయాల పైన సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించటానికి ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం ఖరారైనట్లుగా సమాచారం.

ఒప్పందం ఖరారైందా...ఏం తేల్చారు

ఒప్పందం ఖరారైందా...ఏం తేల్చారు


ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ గానే చెప్పారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకోరని..ఆయన తో కలిసి మార్పు కోసం పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినాయకత్వంతో కీలక చర్చలు నిర్వహించారు. బీజేపీని ఎదుర్కోవటానికి..2024 ఎన్నికల యాక్షన్ ప్లాన్ అందించారు. ఇక, ప్రశాంత్ కిషోర్ అందించిన నివేదికలు..ఆయనను పార్టీలో చేరిక అంశాల పైన ఏఐసీసీ ఒక కమిటీని సైతం నియమించింది. ఏ రాష్ట్రంలో ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలనే అంశం పైన ప్రశాంత్ కిషోర్ తన ప్రజెంటేషన్ లో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అటు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటూ..ప్రాంతీయ పార్టీలతో కలిసి పోరాటం దిశగా కాంగ్రెస్ నాయకత్వాన్ని సమాయత్తం చేస్తున్న ప్రశాంత్ కిషోర్..తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితి పై సర్వే నివేదికలు

తెలంగాణలో పార్టీ పరిస్థితి పై సర్వే నివేదికలు


కొద్ది కాలం క్రితం ప్రశాంత్ కిషోర్ - ప్రకాశ్ రాజ్ ఇద్దరూ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టతో పాటుగా పలు ప్రాజెక్టులను పరిశీలించారు. ఇద్దరూ కలిసి రాజకీయంగా కేసీఆర్ కు అండగా నిలవటానికి సంసిద్దత వ్యక్తం చేసారు. ఇక, ఈ సుదీర్ఘ భేటీలో పీకే తన టీంతో తెలంగాణలో చేయించిన సర్వేల వివరాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తొలుత సర్వేలో భాగంగా 30 నియోజకవర్గాల్లోని వివరాలను పీకే సీఎంకు అందించారు. ఇప్పుడు..తాజాగా 89 నియోజకవర్గాల్లోని పరిస్థితులు...రాజకీయ సమీకరణాలు.. పార్టీ నేతల పని తీరు.. సామాజిక సమీకరణాల పైన పూర్తి స్థాయిలో సర్వే నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావటంతో..ప్లీనరీ ఏర్పాటు చేసారు. అందులో పీకే సర్వే నివేదికల్లోని అంశాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

కేసీఆర్ పాత్ర..రాష్ట్రంలో అధికారం పైనే ఫోకస్

కేసీఆర్ పాత్ర..రాష్ట్రంలో అధికారం పైనే ఫోకస్


ఇక, కాంగ్రెస్ - బీజేపీ యేత పార్టీల కూటమి ఏర్పాటు పైన కొద్ది కాలం క్రితం వరకు చర్చ సాగినా..ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతోనే ప్రాంతీయ పార్టీల కూటమి దిశగా కసరత్తు సాగుతోన్నట్లుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచార సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్..వైసీపీ..బిజేడీ తటస్థంగా ఉంటే బీజేపీ - కాంగ్రెస్ తమ మిత్రపక్షాలతో కలిపి చూస్తే ఓటింగ్ దాదాపు రెండు పక్షాలకు సమానంగా ఉంది. దీంతో..ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో బీజేపి అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశం లేదు. దీంతో..ఇప్పుడు ఈ చర్చల్లో రాష్ట్రపతి ఎన్నిక తె పాటుగా జాతీయ రాజకీయాలు..తెలంగాణ పరిణామాలు..భవిష్యత్ లో జాతీయ స్థాయిలో పొత్తుల అంశం పైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ కు దగ్గరగా వ్యవహరిస్తున్న పీకే.. ఇటు కేసీఆర్ తో సుదీర్ఘ భేటీలకు సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఈ సుదీర్ఘ భేటీ మాత్రం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.

English summary
Political Strategist Prasanth Kihosr marathon meeting with CM KCr now became hot debate in political cirlces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X