ఆ ఛానల్ బెదిరింపు: నటి సునీత వీడియోని పోస్ట్ చేసిన 'జనసేన' వింగ్ శతఘ్ని మిసైల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  నటి సునీత వీడియోని పోస్ట్ చేసిన 'జనసేన' వింగ్ శతఘ్ని మిసైల్

  హైదరాబాద్: మహేష్ కత్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఓ ఛానల్‌లో జరిగిన చర్చలో చెప్పారు. అదే సమయంలో మహేష్ కత్తి కూడా ఆమెపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు.

  మరోవైపు తనను ఓ చానల్ బెదిరిస్తున్నారంటూ సునీత మరో వీడియోను పోస్ట్ చేశారు. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్‌గా భావించే శతఘ్ని మిసైల్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసింది.

  సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీ రామారావు, ఎడిటర్స్ గిల్డ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఈ వీడియోను పోస్ట్ చేశారు.

  అప్ కమింగ్ నటి మాట్లాడే హక్కును ఆ తెలుగు ఛానల్ కాలరాస్తోందని, దాని నుంచి ఆమెను కాపాడాలని కోరింది. తనకు పేరెంట్స్ సపోర్ట్ లేదని, తాను ఆ ఛానల్‌కు వస్తానని చెప్పలేదని, వారే పిలిచారని, ఉన్నది ఉన్నట్లు చెప్పానని, లేనిది చెప్పలేదని, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడమంటే తాను ఉన్నదే చెప్పానని, మహేష్ కత్తికి ఆ ఛానల్ ఇంత మద్దతు ఇస్తుందని తనకు నిజంగా తెలియదని, వాళ్లు తనను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Requesting to come to rescue of upcoming actor complaining that a TV channel is threatening her right to speech.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X