కేసీఆర్‌ను ఇరుకునపెట్టేందుకు ఉన్న అస్త్రాలు ఏమిటి!? సొంతవాళ్లతోనే రేవంత్‌కు చెక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రాజీనామాపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాజీనామా విషయంలో ఆయన డ్రామా ఆడుతున్నారని కొందరు భావిస్తున్నారు.

 కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ఆయుధాలు

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ఆయుధాలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఇరుకున పెట్టేందుకు తన వద్ద ఆయుధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తన రాజీనామాను ఆమోదిస్తే, ఆయన ఆ తర్వాత రేవంత్, కాంగ్రెస్ టీఆర్ఎస్‌లో చేరిన వారి రాజీనామాల అంశాలను లేవనెత్తుతారు. అయితే కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు తన వద్ద ఆయుధాలున్నాయని చెప్పడంతో అవి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు రాజీనామాను పంపించకుంటే

చంద్రబాబు రాజీనామాను పంపించకుంటే

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ స్పీకర్‌కు పంపించకుంటే అప్పుడు తాను ఏం చేయాలో అది చేస్తానని రేవంత్ చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు రాజీనామా ఇచ్చి ఇన్నాళ్లయినా రేవంత్ మాత్రం మౌనంగానే ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి

కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి

రేవంత్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. రాజీనామాను ఆమోదిస్తే కొడంగల్‌లో తిరిగి రేవంత్ గెలుస్తారా అనే అనుమానం ఆ పార్టీలోను ఉందని తెలుస్తోంది.

 రిస్క్ ఇష్టం లేదు

రిస్క్ ఇష్టం లేదు

వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వరుసగా టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని తెలుస్తోంది.

 గెలుపుపై నమ్మకం లేదు

గెలుపుపై నమ్మకం లేదు

రేవంత్ రెడ్డి రాజీనామాపై తాము ఒత్తిడి చేయడం లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపి, పార్టీని బలపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కొడంగల్‌లో ఓడితే కేడర్ స్థైర్యం కోల్పోతుందని చెబుతున్నారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నందున గెలుపుపై నమ్మకం లేదంటున్నారు.

 టీఆర్ఎస్ సిద్ధం

టీఆర్ఎస్ సిద్ధం

మరోవైపు, ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డిపై సై అంటోంది టీఆర్ఎస్. కొడంగల్ బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే ఆయన ముందుకు వెళ్తున్నారు.

 కొడంగల్ పరిస్థితిపై టీంను పంపిన హరీష్ రావు

కొడంగల్ పరిస్థితిపై టీంను పంపిన హరీష్ రావు

హరీష్ రావు రెండు టీంలను కొడంగల్ పంపించారు. అక్కడి పరిస్థితి ఎలా ఉంది, పార్టీకి అనుకూలమా లేదా వ్యతిరేకమా అని తెలుసుకునేందుకు రెండే వేర్వేరు టీంలను పంపించారు. రేవంత్ రెడ్డి మద్దతుదారులు టిఆర్ఎస్‌లో చేరినందున పార్టీ బలపడిందని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. నిన్నటి వరకు రేవంత్ మద్దతుదారులే తమ పార్టీలో చేరడంతో ఇప్పుడు వారితోనే రేవంత్‌కు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది. దీంతో రేవంత్ రాజీనామా వస్తే వెంటనే ఆమోదించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While the resignation drama by Revanth Reddy continues to get curiouser, the Kodangal MLA said he has several surprises in store for chief minister K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి