వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ పర్యటన ఫలితం: చైనాతో 3 ఒప్పందాలు, కెటిఆర్‌కు ఆహ్వానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వ్యాపార వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి చైనాలోని హైనాన్ ప్రావిన్స్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది. ఐటి మంత్రి కె తారక రామారావు సమక్షంలో కుదిరిన ఒప్పందంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలంగాణ తరఫున, హైనన్ గవర్నర్ లియుసిగుయ్ హైనన్ తరఫున సంతకాలు చేశారు.

ఐటి పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయ. అలాగే హెనన్ ప్రావిన్స్‌లో అపోలో ఆస్పత్రి నిర్మాణం, టి-హబ్‌కు సహకారంపైనా ఒప్పందం కుదిరింది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను హైనన్ ప్రతినిధులకు ఐటి మంత్రి కెటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన ఫలితాలు మొదలయ్యాయని అన్నారు.

గతంలో చైనాలో పర్యటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించిన మేరకు హైనాన్ రాష్ట్ర ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చారని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించామని చెప్పారు. రెండు రాష్ట్రాలమధ్య సయోధ్య, అంగీకారం కుదర్చుకోవడానికి ఈ పర్యటన దోహదపడిందన్నారు.

ఈ సందర్భంగా మూడు ఒప్పందాలు కుదరటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైనాన్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్య అవగాహన, పెట్టుబడుల అవకాశాలపై ఎంవోయూ కుదర్చుకున్నామన్నారు. మనదేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ అయిన టీ-హబ్‌తో హైనాన్ ఒప్పందం కుదుర్చుకుందుని మంత్రి వెల్లడించారు. దీనివల్ల చైనా స్టార్టప్ కంపెనీలు భారత్‌లోకి అడుగుపెట్టడానికి టీ-హబ్ ద్వారా అవకాశం ఏర్పడుతుందన్నారు. దీంతో పాటు అపోలో హస్పిటల్ యాజమాన్యం హైనాన్ రాష్ట్రంలో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడానికి మరో ఒప్పందం కుదిరిందన్నారు.

ఇరు రాష్ట్రాలు భవిష్యత్‌లో మరింతగా కలిసి పనిచేసే దిశగా ఈ ఒప్పందాలు ఫలితానిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైనాన్ రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబర్, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు అహ్వానించారు. హైనాన్ రాష్ట్ర గవర్నర్ లీయూ సిగయ్ మాట్లాడుతూ.. తెలంగాణ- హైనాన్ రాష్ట్రం మధ్య సంబంధాలు బీజం పడిందని అన్నారు. హైనాన్‌లో పర్యటనకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆయన అహ్వానించారు.

ఐటి రంగంలో పరస్పరం సహకరించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై చైనా భాషలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా చైనా ప్రతినిధుల కోసం ప్రదర్శించారు. హైనన్ ప్రావిన్స్ ప్రతినిధులు తమ రాష్ట్రానికి రావాలని ఐటి మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. నవంబర్‌లో చైనాలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని కెటిఆర్‌ను ఆహ్వానించారు. చైనా సందర్శనలో తప్పకుండా హైనన్ నగరానికి వస్తానని కెటిఆర్ తెలిపారు.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

వ్యాపార వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి చైనాలోని హైనాన్ ప్రావిన్స్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

ఐటి మంత్రి కె తారక రామారావు సమక్షంలో కుదిరిన ఒప్పందంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలంగాణ తరఫున, హైనన్ గవర్నర్ లియుసిగుయ్ హైనన్ తరఫున సంతకాలు చేశారు.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

ఐటి పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయ. అలాగే హెనన్ ప్రావిన్స్‌లో అపోలో ఆస్పత్రి నిర్మాణం, టి-హబ్‌కు సహకారంపైనా ఒప్పందం కుదిరింది.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను హైనన్ ప్రతినిధులకు ఐటి మంత్రి కెటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన ఫలితాలు మొదలయ్యాయని అన్నారు.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

గతంలో చైనాలో పర్యటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించిన మేరకు హైనాన్ రాష్ట్ర ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చారని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించామని చెప్పారు. రెండు రాష్ట్రాలమధ్య సయోధ్య, అంగీకారం కుదర్చుకోవడానికి ఈ పర్యటన దోహదపడిందన్నారు.

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

హైనాన్ ప్రావిన్స్‌తో తెలంగాణ ఒప్పందాలు

ఈ సందర్భంగా మూడు ఒప్పందాలు కుదరటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైనాన్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్య అవగాహన, పెట్టుబడుల అవకాశాలపై ఎంవోయూ కుదర్చుకున్నామన్నారు. మనదేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ అయిన టీ-హబ్‌తో హైనాన్ ఒప్పందం కుదుర్చుకుందుని మంత్రి వెల్లడించారు.

English summary
Telangana government today said it has inked a deal with China's Hainan province for establishment of sister-province relationship with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X