T Hub పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ జీఓ రివర్స్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న టీ హబ్ (T Hub) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని, వైఖరిని మార్చుకుంది. హైదరాబాద్ లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా టీ హబ్ కు తరలించాలని గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలకు తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో వెనక్కి తగ్గింది. టీ హబ్ వినియోగంపై తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా టీ హబ్‌కు తరలించాలని జీఓ సైతం జారీ అయింది. ఈ జీఓ జారీ చేసిన జీఓను ఉపసంహరించుకుంది రేవంత్ ప్రభుత్వం. ఈ జీఓ గురించి తెలుసుకున్న వెంటనే అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు ఆదేశించారు.

ఈ మేరకు ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ని ఆదేశించారు. టీ హబ్ అనేది స్టార్టప్‌ల అభివృద్ధి కోసమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ హబ్ కు చెందిన ప్రతి అంగుళాన్ని కూడా స్టార్టప్‌లు, టెక్ సంస్థలు, అంకుర దశలో పరిశ్రమలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించినదని, ఇందులో ప్రభుత్వ కార్యలయాలు కొనసాడానికి ఎంతమాత్రం ఆస్కారం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
అటువంటి కంపెనీలకు ప్రోత్సాహం అందించడానికి మాత్రమే టీ హబ్ ను వినియోగించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ కు అనుగుణంగా, అనుకూలంగా యూనికార్న్‌లను సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అద్దె భవనాలలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు తరలించడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా, ఆవిష్కరణల ఉత్ప్రేరకంగా స్థాపించి టీ హబ్‌లో మరే ఇతర కార్యాలయాలు ఉండకూడదని తేల్చి చెప్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications