Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!

రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో ఎండల తీవ్రత కారణంగా లబ్దిదారుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సరుకుల కోటాను ఈ నెలలోనే లబ్దిదారులకు అందించనుంది. దీంతో మూడు నెలల కోటాను రేషన్‌కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు.అదే సమయంలో లబ్దిదారులకు ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు స్పష్టత ఇచ్చారు.

రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల రేషన్ ప్రభుత్వం ఒకే సారి అందిస్తోంది. దీంతో.. రేషన్ దుకాణాల వద్ద భారీగా రద్దీ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాజా నిర్ణయం వెల్లడించింది. మూడు నెలల కోటాను రేషన్‌కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. కానీ మూడు నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో మరింత సమయం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీకి సిద్దమైంది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ పోస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో, రద్దీ నియంత్రణతో పాటుగా లబ్ది దారుల్లో ఆందోళన తొలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!
telangana-govt-extends-ration-supply-time-for-beneficiaries-across-the-state-up-to-30th-of-this-mont

ఈ నెలఖరు వరకు రేషన్ సరఫరా గడువు పొడిగింపు

రేషన్ పొందేందుకు డీలర్ల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కూలీ పనులు మానుకుని మరీ రేషన్ షాపుల వద్ద గంటల పాటు వేచి ఉంటున్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో మూడు నెలల వరకు రాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీంతో, ఈ రద్దీ నియంత్రణతో పాటుగా అందరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. దీని లో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 15వ తేదీ వరకే ప్రతీ నెలా రేషన్ ఇస్తుండటంతో.. సమయం సమీపిస్తున్న వేళ రద్దీ పెరుగుతోంది. దీంతో.. నెలాఖరు వరకు ఈ అవకాశం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వృద్దులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు ప్రారంభించారు. రేషన్ సరుకుల స్టాక్ తగినంత స్థాయిలో అందుబాటులో ఉండదని, ఎప్పటికి అప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్‌ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+