కార్పొరేట్ సంస్థల కీలక ఒప్పందాలు, భారీ పెట్టుబడులు..!!
తెలంగాణలో పెట్టుబడులకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాయి. తెలంగాణలో డెయిరీ విస్తరణ కోసం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్డీ సెంటర్ కోసం ఫెర్టిస్ ఇండియాతో ఒక ఒప్పందం జరిగింది.
ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టు బడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డితో గోద్రెజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఫిరోజ్ షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణపై ఫిరోజ్‌షా గోద్రెజ్ సీఎంతో చర్చించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ఎస్టేట్, ఆయిల్‌పామ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపిస్తుంది. మరోవైపు సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీఆర్డీఎంవో) నిర్మాణానికి రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

అదే విధంగా సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్.. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చు న్నాయి. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, సుమధుర గ్రూప్ ప్రతినిధులు.. సీఎం రేవంత్‌ను కలిసి ప్రభుత్వంతో ఎంవోయూ కుద్చుకున్నారు. వీరితో పాటు అరబిందో, భారత్ బయో టెక్, హెటెరో, ఎంఎస్‌ఎన్ ఫార్మా ప్రతినిధులు కూడా సీఎంను కలిసి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. అంతేకాకుండా.. వింటేజ్ కాఫీ హౌస్, కేజే ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు, బయోలాజికల్స్ ఈ, విజ్జి ఇంక్ (యుఎస్‌ఏ) , గ్రాన్యూల్స్ ఫార్మా ప్రతినిధులు, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు వరుసగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ సంస్థలు కాంగ్రెస్ సర్కార్‌తో ఎంవోయూ చేసుకున్నాయి. అలాగే సీఎం రేవంత్‌ను ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అనివేశ్, అనలాగ్ ఏ ఐ ఓటూడ్లోజ్ ప్రతినిధులు, డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, సెంబ్ కార్ప్ (సింగపూర్) ప్రతినిధులు, తల్వాన్ గ్రూప్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. కొత్త పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా రేవంత్ పేర్కొ రు. ప్రభుత్వం అన్ని రకాలుగా పెట్టుబడి దారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications