తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్
Railway Manufacturing Unit: తెలంగాణలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల రాష్ట్రం దశ దిశ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అదే- రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. 160 ఎకరాల విస్తీర్ణంలో ఖాజీపేట్ వద్ద నిర్మితమౌతోంది. దీని నిర్మాణ వ్యయం 521.36 కోట్ల రూపాయలు.
ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది. 2023 జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌గా ప్రతిపాదించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా బదలాయించింది.

దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతి గురించి వివరించారు. 85 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న వాటిలో మెయిన్ షాప్ అంటే.. వ్యాగన్ల తయారీ కోసం కేటాయించిన యూనిట్, టెస్ట్, పెయింట్ షాపులు, పరిపాలనా సౌకర్యాలు, అంతర్గత రైల్వే ట్రాక్‌లు, ఇతర యూనిట్లు ఉన్నాయి.
స్టోర్ వార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పిట్ ట్రావెర్సెస్, టెస్ట్ షాప్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. రైల్వేల రోలింగ్ స్టాక్‌ల తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి పెద్దఎత్తున ఊతమిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సిటీ రైళ్లతో సహా రోలింగ్ స్టాక్‌ల తయారీకి కేంద్రంగా నిలుస్తుందని అన్నారు.
మెయిన్ రైల్వే లైన్ తో దీన్ని అనుసంధానించడానికి 13.15 కిలోమీటర్ల ఇంటర్నల్ ట్రాక్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు ఇక్కడి నుంచే రైల్వే వ్యాగన్లు సరఫరా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోన్న నేపథ్యంలో- వీటి కొరత తీరుతుందని జీ కిషన్ రెడ్డి చెప్పారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications