తెలంగాణలో కోల్డ్ వేవ్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలంగాణలో చలి చంపేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కోల్డ్ వేవ్ కారణంగా చలి.. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా వణికిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దాంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లు జారీ చేశారు అధికారులు. ఇవాళ్టి నుంచి మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉదయం.. సాయంత్రం శీతల గాలులు వీస్తున్న కారణంగా బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుని అటు వాహనదారులు సైతం రోడ్డు కనబడే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో రెండ్రోజుల పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోతున్నాయి. ఇక మెదక్ లో 11, హన్మకొండలో 12, హైదరాబాద్ లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. రానున్న రెండు రోజుల్లో చలి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. భాగ్యనగరంలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి పెద్దల వరకు వైరల్ వ్యాధులతోపాటు.. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు న్యుమోనియా, ఇన్ ఫ్లూయెంజా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications