షార్ట్ ఫిల్మ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు కేరాఫ్ అడ్రస్.. హైదరాబాద్ కు 55 కి. మీ. దూరంలోనే..
తెలంగాణలో వీకెండ్ టూరిజం క్రమంగా పెరుగుతోంది. వారం మొత్తం బిజీ లైఫ్ తో గడిపిన టెకీలు, ఉద్యోగులు, విద్యార్థులు.. వీకెండ్ లో నచ్చిన ప్లేస్ కు వెళ్లి చిల్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతాలకే టూరిస్టులు ఎక్కువగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు పెళ్లిళ్లంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాల్సిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇప్పుడు చాలామంది కొత్త జంటలు వికారాబాద్ లోని ఈ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అటు టూరిస్టులు సైతం అధిక సంఖ్యలో ఈ ప్రాంతాలకు వస్తున్నారు. వికారాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం టూరిజం అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో చర్యలు చేపడుతోంది.
ముఖ్యంగా పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల పరిధిలో లక్నాపూర్ ప్రాజెక్టు, కోట్ పల్లి ప్రాజెక్టు, అనంతగిరి, దామగుండం, సర్పన్ పల్లి ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు ఇప్పుడు అటు షూటింగ్స్ కు ఇటు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఇక్కడే సఫారీ, పక్షుల దర్శనం, ఉద్యానాలు, ఈత కొలనులు, క్రీడా మైదానాలు, పండ్ల తోటలు.. ఉన్నాయి. ఇక సఫారీ వాహనంలో ఒక్కొక్కరికి ఫీజు రూ.250 గా ఉంది.

మరోవైపు తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందిన ఈ వికారాబాద్ అటవీ అందాలను చూసేందుకు హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్ణాటక.. తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. ఇదే క్రమంలో పర్యాటక, అటవీ శాఖలు సంయుక్తంగా వికారాబాద్ అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇటీవలికాలంలో వికారాబాద్ అడవుల్లో ఫోటో షూట్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications