సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లకు సిటీలోనే కొత్త హాల్ట్ స్టేషన్
Lingampalli Railway Station: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఇప్పుడిప్పుడే నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇక.. హైదరాబాద్ వాసులు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు రైళ్ల మీదే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు.
దీనివల్ల రైళ్ల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి ప్రధాన స్టేషన్లు చాలట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి స్టేషన్లను తాత్కాలికంగా వినియోగించుకుంటోన్నారు. ఈ క్రమంలో ఇదివరకే పలు రైళ్లకు హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 7 నుంచి ఇక్కడ కొన్ని రైళ్లు ఆగుతున్నాయి. 20వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తాజాగా లింగంపల్లి స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి స్టేషన్లో పలు రైళ్లకు తాత్కాలిక హాల్ట్ సౌకర్యాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సదుపాయం ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

22718 సికింద్రాబాద్- రాజ్‌కోట్, 22717 రాజ్‌కోట్- సికింద్రాబాద్, 20967 సికింద్రాబాద్- పోర్బందర్, 20968 పోర్బందర్- సికింద్రాబాద్, 12732 సికింద్రాబాద్- తిరుపతి, 12731 తిరుపతి- సికింద్రాబాద్, 12702 హైదరాబాద్- ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై, 12701 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై- హైదరాబాద్, 12026 హైదరాబాద్- పూణే, 12025 పూణే- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇకపై లింగంపల్లి స్టేషన్ లో ఆగుతాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనుల దృష్ట్యా, ప్లాట్‌ఫాం నంబర్ 1పై పార్కింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ పరిమిత పికప్/డ్రాప్-ఆఫ్ సేవలు మాత్రమే లభ్యమౌతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తుతున్నాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. స్టేషన్ ఎంట్రీ ర్యాంప్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్, ప్లాట్ ఫామ్ షెడ్స్ పూర్తయ్యాయి. స్టేషన్ భవన సముదాయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సర్కులేటింగ్ ఏరియా నిర్మాణం సాగుతోంది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications