వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు కేసులో బాబుపై కెసిఆర్ రివర్స్! దోస్తీపై చంద్రబాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏం పని అని, ఆయన ఏపీలో అభివృద్ధి చేసుకోవాలన్న తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యాఖ్యల పైన.. చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తన పార్టీ ఇక్కడ ఉందని, తనకు ప్రచారం చేసుకునే హక్కు ఉందని చంద్రబాబు చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన ఆస్తులు హైదరాబాదులో ఉన్నాయని, తన పిల్లలు, మనవడు ఇక్కడే ఉంటున్నాడని, తన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా తనకు ప్రచారం చేసే హక్కు ఉందని కెసిఆర్‌కు బాబు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తన దోస్తీ కేవలం అధికారికమే అన్నారు. రెండు ప్రభుత్వాలు సామరస్యంగా వెళ్లాలనన్నారు. పార్టీ పరంగా టిడిపి భవిష్యత్తు పైన తన దృష్టి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ కంపెయిన్ నిర్వహించారు.

 కెసిఆర్

కెసిఆర్

ఓటుకు నోటు కేసు నేపథ్యంలో 'బాస్' పైన కేసు గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. దాని గురించి జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత మాట్లాడుదామని కెసిఆర్ చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే రాత్రికి రాత్రి సమస్యలు పరిష్కారం కావని, అయిదారేళ్లు పడుతుందని కెటిఆర్ చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌ ప్రజలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిదో ఆలోచించి ఓటేయాలని, నాయకుల నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

కెసిఆర్

కెసిఆర్

సరైన పార్టీకి, అభ్యర్థికి ఓటు వేస్తేనే అభివృద్ధి ఫలాలు దక్కుతాయని చెప్పారు. పండ్ల చెట్లను పెడితే పండ్లు ఇస్తాయని, ముళ్ల చెట్లు పెడితే ముళ్లే వస్తాయని గుర్తించాలని అన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో, నగరంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. బండికి ఒకవైపు కోడెదూడ, మరోవైపు దున్నపోతు ఉంటే ముందుకు సాగదని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు హైదరాబాద్‌ను అన్ని విధాల నాశనం చేశాయని విమర్శించారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌ను సకల వసతులతో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమకు అవకాశం కల్పించాలన్నారు. గురువారం తెలంగాణ భవన్‌ నుంచి ఆయన ఎలక్ట్రానిక్‌ ప్రచారం (ఇ-క్యాంపెయిన్‌) ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ట్రాఫిక్‌ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో తాను ప్రచారానికి వెళ్లకుండా ఎలక్ట్రానిక్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టానని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

నగరాభివృద్ధికి రూ. 30 వేల కోట్లతో ప్రణాళికలను రూపొందించామని, ఇటీవల చైనా వెళ్లినప్పుడు రూ. 25 వేల కోట్లను మంజూరు చేయాలని బ్రిక్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కామత్‌ను కోరగా ఆయన హామీ ఇచ్చారని కెసిఆర్ చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి భారీ పైవంతెనలు, స్కైవేలు, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

గ్రేటర్‌ నగరాభివృద్ధికి అనువుగా టిడిపి, బిజెపి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని, నిండు మనసుతో ఆశీర్వదించాలని టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.

 చంద్రబాబు

చంద్రబాబు

నీతివంతమైన, సమర్థమైన పాలన టిడిపి మాత్రమే అందించగలదని చంద్రబాబు పేర్కొన్నారు. బాంబులకే బెదరని తాను, తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితే లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన పటాన్‌చెరు, రామచంద్రాపురం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కొత్త రాష్ట్రం.. అక్కడ ఎన్నో సమస్యలున్నాయని, రాజధాని అభివృద్ధి చేయాలని, ఎన్నెన్నో పనుల ఒత్తిడి ఉంటోందని, కొందరు నేనెక్కడికో వెళ్లిపోయానని దుష్ప్రచారం చేస్తున్నారని, నేనిక్కడే ఉంటానని, తన భార్య, కుమారుడు ఇక్కడే ఉన్నారని, తెలుగుజాతి ఎక్కడుంటే అక్కడుంటానని స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగువాళ్లు ఎక్కడుంటే తెలుగుదేశం జెండా అక్కడ ఎగురుతుందన్నారు. గ్రేటర్‌లో టిడిపి, బిజెపిల గెలుపు చరిత్రాత్మక అవసరమని చంద్రబాబు పిలుపునిచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా కసి, కోపం కన్పిస్తున్నాయి.
అవి ఫిబ్రవరి 2న చూపించాలన్నారు. తెరాస, కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. అన్ని సీట్లు మనమే గెలుస్తామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఒకప్పుడు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకు అబిడ్స్‌ ఒక్కటే కేంద్రంగా ఉండేదని,. శివారు ప్రాంతాలు ఎక్కడో ఉండేవని, నేనొచ్చాక దీనినో నగరంగా తీర్చిదిద్దానని, రెండేళ్లలోనే కొత్త నగరం నిర్మించానని, తెలుగువారికి చక్కటి రాజధాని ఉండాలని, ప్రపంచమంతా తిరిగానని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఐటీ కంపెనీలను నగరానికి తెచ్చానని, మన పిల్లల బతుకులు బాగుపడాలనే ఇదంతా చేశానని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. టిడిపి వచ్చాక అంతర్జాతీయ హంగులతో ఆడిటోరియాలు, శిల్పారామం, హైటెక్స్‌ నిర్మించామని, ట్రాఫిక్‌ రద్దీ నివారణకు నగరవ్యాప్తంగా ఫ్లైఓవర్లు కట్టామని, ఎన్టీఆర్, తర్వాత నేనే నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాద్‌లో సంపద సృష్టించి, ఆదాయం పెంచడానికి అన్ని ప్రాంతాల వాళ్లం 20ఏళ్లు కష్టపడ్డామని, ఆదాయం పెరగడంతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని, హైదరాబాద్‌ ఏ ఒక్కరి సొంతం కాదని, ఇది అందరి నగరమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండరాదనే అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించానని, తర్వాత ఆయన యజ్ఞానికి పిలిస్తే వెళ్లానని, ప్రభుత్వాల పరంగా సహకరించుకోవడం వేరని, రాజకీయ పోరాటం వేరని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం ఎక్కడకైనా వెళ్తానని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు


మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, అర్ధరాత్రి అయినా వచ్చి కాపాడుకుంటానని, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు నిబంధనలు పెట్టారని, సమస్యలు రాకూడదనే జనాభా దామాషా పద్ధతిలో 58శాతం భరించేందుకు ముందుకొచ్చామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

చివరికి కోర్టుల వరకు వ్యవహారం వెళ్లిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశలోని 26 బీసీ ఉపకులాలను తెలంగాణ జాబితా నుంచి తొలగించారని, ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా వాళ్లు చేసిన పాపం ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు.

English summary
In an obvious reference to Telangana Chief Minister K Chandrasekhar Rao asking “what business does he have campaigning for the GHMC polls,” TDP national president and AP Chief Minister Chandrababu Naidu said he had every right to campaign for his party anywhere and there would be no compromise with anyone in taking up a political fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X