2014లో గ్రాడ్యుయేషన్, 2017లో ఇంటర్ చదివినట్లు చూపిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చూపించిన దానికి తేడా ఉందని తెలుస్తోంది.

మైనంపల్లి హన్మంత రావు 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన తన విద్యార్హతను గ్రాడ్యుయేషన్‌గా చూపించారు.

TRS Hyderabad chief qualifications differ

అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ చేసినట్లు నాటి దరఖాస్తుల్లో పేర్కొన్నారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన విద్యార్హత ఇంటర్మీడియేట్‌గా చూపించారు.

అలబామా స్టేట్ రికార్డుల ప్రకారం మైనంపల్లి కొన్నేళ్లు హంట్స్ విల్లేలో ఉన్నారు. హన్మంత రావు ప్రస్తుతం హైదరాబాద్ అధ్యక్షులు. అసెంబ్లీ కోటాలో ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 6న ఆయన చూపిన అఫిడవిట్లో ఇంటర్మీడియేట్ చేసినట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+