వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిమ్మల్ని గారు అంటే...: హీరో విజయ్ దేవరకొండకు కెటిఆర్ రిప్లై

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావుకు అనూహ్యమైన దిశ నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి. సినీ తారలు కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఆయనను ట్వట్టర్‌లో అభినందించారు.

తనకు కంగ్రాట్స్ చెప్పిన వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెబుతూ కెటిఆర్ రీట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కేటీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

విజయ్ దేవరకొండ ట్వీట్స్ వైరల్

విజయ్ దేవరకొండ ట్వీట్స్ వైరల్

ట్విట్టర్‌లో కెటిఆర్‌కు విజయ్ దేవరకొండ తెలిపిన శుభాకాంక్షలు వైరల్ అవుతున్నాయి. మరో విజయ్ దేవరకొండ ఏ విధంగానైతే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారో. అదే రీతిలో కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చి నెటిజన్లను ఆకట్టుకున్నారు.

రామన్నా అంటూ విజయ్ దేవరకొండ..

రామన్నా అంటూ విజయ్ దేవరకొండ..

"రామన్నా, లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం" అంటూ ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ.

కెటిఆర్ ఇలా ట్వీట్..

కెటిఆర్ ఇలా ట్వీట్..

దీనికి సమాధానంగా కేటీఆర్.. "థ్యాంక్స్ అర్జున్ రెడ్డి... ఇప్పుడు మిమ్మల్ని ‘గారు' అంటే బాగుండదేమో" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. వీరి ట్విట్లపై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

వెన్నెల కిశోర్ ఇలా ట్వీట్...

వెన్నెల కిశోర్ ఇలా ట్వీట్...

కెటిఆర్ సార్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ వెన్నెల కిశోర్ ట్వీట్ చేశారు. నిజంంగా మీరు అందుకు అర్హులని ఆయన కెటిఆర్‌ను అభినందించారు. కెటిఆర్ భాయ్ కంగ్రాట్స్ అంటూ నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ చేశారు మీరు అవిశ్రాంతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రత్యేకంగా స్టార్టప్ కాంపైన్ అని అన్నారు.

English summary
Telangana IT minister KT Rama Rao replied to Telugu Cinma hero Vijay Devarakonda's tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X