భార్యకు షాక్‌ల మీద షాక్‌లు: ప్రేమ పెళ్లి చేసుకుని చుక్కలు చూపిస్తున్నాడు!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. భార్యను వదిలి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. గతంలోను ఇదే రీతిలో వ్యవహరించిన అతను.. భార్య ప్రయత్నంతో తిరిగి ఇంటికి చేరుకోగా.. ఈసారి మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో సదరు వివాహిత పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన బండి రాజబాబు(27) మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన కృష్ణవేణి(24)ని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 14నెలల బాబు కూడా ఉన్నాడు.

 wife complaint for missing husband since last year

కాపురం సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో.. ఉన్నట్లుండి రాజబాబు కృష్ణవేణికి షాక్ ఇచ్చాడు. ఇంటికి వెళ్లొస్తానని చెప్పెళ్లిన వ్యక్తి అక్కడే మకాం పెట్టాడు. భర్త ఎన్ని రోజులైనా ఇంటికి రాకపోవడంతో బాబును తీసుకుని కృష్ణవేణే అతని గ్రామానికి వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక.. రాజబాబు కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లోకి అనుమతించలేదు సరికదా.. అసలు ఈ పెళ్లి చెల్లదంటూ మరో షాక్ ఇచ్చారు.

ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాజబాబుకు సర్దిచెప్పిన పోలీసులు.. అతన్ని కృష్ణవేణితో హైదరాబాద్ పంపించారు. అలా వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయాడు రాజబాబు. గతేడాది మార్చి చివరి వారంలో పనికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి.. ఇప్పటిదాకా ఇంటికి తిరిగిరాలేదు. ఎక్కడ వెతికినా.. ఎంత ప్రయత్నించినా.. లాభం లేకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a case a woman filed a missing complaint one years after her husband went missing. She was living in Medchal area
Please Wait while comments are loading...