తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్యగ్రహణం ఎఫెక్ట్: 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, దర్శనాలు అప్పటినుండే!!

|
Google Oneindia TeluguNews

నేడు సూర్య గ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూతపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతపడింది. నేడు సూర్యగ్రహణం మధ్యాహ్నం ప్రారంభం కానుండటంతో, గ్రహణానికి ఆరు గంటల ముందు నుండే సూతక కాలం గా పరిగణించి ఆలయాలను మూసివేస్తారు. ఈ క్రమంలోనే నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత..

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత..

ఉదయం ఎనిమిది గంటల 11నిమిషాలకు మూతపడింది. ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది. అంటే మొత్తం 12 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసి వేస్తున్నారు. అక్టోబర్ 24న సిఫార్సు లేఖలను అనుమతించలేదు. అక్టోబర్ 25 మంగళవారం నేడు సూర్య గ్రహణం కారణంగా ఆలయం మూసివేత కొనసాగుతుండడంతో టీటీడీ అధికారులు బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు.

18 గంటల పాటు భక్తులకు దర్శనాలు రద్దు

18 గంటల పాటు భక్తులకు దర్శనాలు రద్దు


వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తోపాటు, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ లను కూడా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక సూర్య గ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నారు. గ్రహణం విడిచిన తర్వాత పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి నిర్వహించి, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, రాత్రి తొమ్మిది గంటల నుండి భక్తులను స్వామి దర్శనం కోసం అనుమతిస్తారు.

గ్రహణాల సమయంలో బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

గ్రహణాల సమయంలో బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

కాగా నేడు సూర్య గ్రహణం కారణంగా, నవంబరు 8వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా స్వామివారి దర్శనాన్ని టిటిడి అధికారులు కుదిస్తున్నారు. నవంబర్ 8 వతేదీన చంద్ర గ్రహణం కారణంగా కూడా ఉదయం 8.30 నిముషాల నుండి, రాత్రి 7.30 నిముషాల వరకు ఆలయాన్ని మూసివెయ్యనున్నారు. కేవలం ఈ రెండు రోజులు గ్రహణం విడిచిన తర్వాత సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. గ్రహణాల రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బ్రేక్ దర్శనాలు, విఐపి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

 గ్రహణ సమయంలో ప్రసాద వితరణ నిలిపివేత

గ్రహణ సమయంలో ప్రసాద వితరణ నిలిపివేత

ఇక గ్రహణ సమయంలో ప్రసాద వితరణ సైతం నిలిపివేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 69 వేల 278 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 17660 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. సోమవారం స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

English summary
Tirumala venkateshwara swamy Temple was closed for 12 hours due to solar eclipse effect. The temple will remain closed from 8:11 am to 7:30 pm today. TTD allows Swamy darshan only after samprokshana after 18 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X