విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో చేరికపై రాధా స్పందన-తాడేపల్లి డైరెక్షన్ గుడివాడలో యాక్షన్-అనుచరులకు క్లారిటీ

|
Google Oneindia TeluguNews

విజయవాడ టీడీపీ వేత వంగవీటి రాధా కృష్ణ త్వరలో తాను వైసీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. నిన్న మంత్రి కొడాలి నానిని ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్న ఆయన రెండు గంటల పాటు వ్యక్తిగతంగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీలోకి తిరిగి రాధా చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. దీనిపై తన అనుచరుల వద్ద స్పందించిన రాధా.. పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. తాడేపల్లి డైరెక్షనే లోనే గుడివాడలో యాక్షన్ ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 కొడాలి నానితో వంగవీటి రాధా

కొడాలి నానితో వంగవీటి రాధా

గతంలో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై టీడీపీలో చేరిన బెజవాడ నేత వంగవీటి రాధా ఏం చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా ఆయన గుడివాడలో తన పాత స్నేహితుడు మంత్రి కొడాలి నానికి సంబంధం లేకుండా అనుచరులతో వ్యక్తిగతంగా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గుడివాడలో కొడాలి నాని పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఇది కొనసాగుతుండగానే నిన్న తాజాగా వంగవీటి రాధా ఓ పెళ్లి వేడుకలో మంత్రి కొడాలి నానిని కలుసుకున్నారు. కొడాలితో సంబంధాలు బెడిసికొట్టాయనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో రాధా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీలోకి రీ ఎంట్రీ ప్రచారం

వైసీపీలోకి రీ ఎంట్రీ ప్రచారం


గతంలో వైసీపీలో పనిచేసి వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరమైన వంగవీటి రాధాను తిరిగి ఆ పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి కొడాలి నాని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం మొదలైంది. నిన్న ఓ పెళ్లి వేడుకలో కొడాలిని కలిసిన వంగవీటి రాధా రెండు గంటల పాటు విడిగా చర్చలు జరపడంతో ఈ అనుమానాలు నిజమేనని అనిపించాయి. వైసీపీలోకి వస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని కొడాలి ఆయనకు హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం సాగింది. దీంతో కొన్ని షరతులకు అంగీకరిస్తే వైసీపీలోకి వంగవీటికి రీ ఎంట్రీ ఇప్పించేందుకు కొడాలి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

వైసీపీలో చేరికపై స్పందించిన రాధా

వైసీపీలో చేరికపై స్పందించిన రాధా


నిన్న మంత్రి కొడాలి నానితో భేటీ నేపథ్యంలో వైసీపీలో తాను తిరిగి చేరబోతున్నట్లు మొదలైన ప్రచారంపై వంగవీటి రాధా తన అనుచరుల వద్ద స్పందించారు. సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ప్రచారానికి గల కారణాలను ఆయన వారిని తెలుసుకున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న తాను వైసీపీలో చేరతానని ప్రచారం జరగడం వెనుక ఎవరున్నారనే దానిపైనా ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. నిన్న గుడివాడలో పరిణామాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న ప్రచారంపై పూర్తి వివరాలు తెలుసుకున్న రాధా.. తన అనుచరులకు స్పష్టత ఇచ్చేశారు.

వైసీపీలో చేరిక ప్రచారంపై రాధా ఆగ్రహం

వైసీపీలో చేరిక ప్రచారంపై రాధా ఆగ్రహం


తాను వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి గుడివాడ పరిణామాలపై అనుచరులతో మాట్లాడిన వంగవీటి.. వైసీపీలో చేరుతున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుభ కార్యాలను సైతం రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి గుడివాడకు పాకిందని వంగవీటి వ్యాఖ్యానించినట్లు సమాచారం. శుభకార్యాల్లో శత్రువు ఎదురుపడినా పలకరించడం భారతీయ సంప్రదాయమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల స్ధానంలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని వంగవీటి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

తాడేపల్లి డైరెక్షన్-గుడివాడలో యాక్షన్

తాడేపల్లి డైరెక్షన్-గుడివాడలో యాక్షన్


నిన్నటి గుడివాడ పరిణామాలపై స్పందించిన వంగవీటి రాధా.. తాడేపల్లి డైరక్షన్ కు గుడివాడలో యాక్షన్ జరిగిందని వ్యాఖ్యానించడం విశేషం. ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదని రాధా అనుచరులతో చెప్పారు. వాస్తవానికి పామర్రు నుంచి గుడివాడకు ర్యాలీగా తరలి వెళ్ళేందుకు వంగవీటి అభిమానులు సమాయత్తమయ్యారని, ర్యాలీలతో శుభకార్యాలకు హాజరు కావడం సభ్యత కాదని వంగవీటి అభిమానులను వారించినట్లు రాధా వెల్లడించారు. మన రాజకీయాలకు శుభకార్యాలు వేధిక కాకూడదని రాధా తెలిపారు. శుభకార్యంలో ఉన్నప్పుడే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందని,
ఇదంతా తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో గుడివాడలో ప్రచారం జరిగినట్లు భావిస్తున్నట్లు ఆయన అనుచరులతో పంచుకున్నట్లు తెలుస్తోంది.

English summary
tdp leader vangaveeti radha krishna on today denied rumours on his rejoining into ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X