అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణం
ఓ పెళ్లి సంబంధం అన్నదమ్ముల మధ్య గొడవకి కారణం అవడమే కాదు, ఏకంగా తమ్ముడిని అన్న హత్య చేసేదాకా తీసుకు వచ్చింది. కొడుకుకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులకు ఒక కొడుకు మరణం, మరో కొడుకు హంతకుడిగా మారడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే
అన్నను పెళ్లి చూపులు చూసి తమ్ముడ్ని చేసుకుంటా అన్న అమ్మాయి .. ఓకే చెప్పిన పెద్దలు
అచ్యుతాపురం మండలం జాలరి పాలెం కు చెందిన మడ్డు పోలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు రాజు . చిన్న కొడుకు పేరు యర్లయ్య. రాజు కి పెళ్లి చేయడానికి భీమిలి కి చెందిన అమ్మాయి ని చూశారు. అయితే ఆ అమ్మాయి పోలమ్మ పెద్దకుమారుడు రాజును కాకుండా, చిన్న కుమారుడు ఎర్లయ్య ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది . దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు వేరే సంబంధం చూస్తానని నచ్చజెప్పింది .

తనను కాదన్న అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని అన్న ఘాతుకం
ఇక మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. తనకు చూసిన సంబంధం తనకు కాకుండా తమ్ముడికి చేయడాన్ని రాజు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర అసహనానికి గురయ్యాడు.
సోమవారం రోజు ఎర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులు అడిగాడు. ఆమె రెండు వేల రూపాయలు ఇవ్వగా, అవి సరిపోవని 4000 రూపాయలు కావాలంటూ తల్లి తో గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కడే ఉన్న రాజు తల్లితో గొడవ పడుతున్న యర్లయ్యను అడ్డుకుని పక్కన ఉన్న కత్తిని అమాంతం తమ్ముడు గొంతులో దించాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాజు పరారయ్యాడు.

తమ్ముడ్ని చంపి పరారైన అన్న .. పెళ్లి కోసమే చేశానని పోలీసుల ముందు అంగీకారం
యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించాడు . పరారైన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టారు. తనను కాదన్న అమ్మాయిని తన తమ్ముడి పెళ్లి చేసుకోవటం రాజుకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయినా తమ్ముడు తనను కాదని చెప్పిన అమ్మాయినే చేసుకుంటున్నందుకు తమ్ముడును చంపానని పోలీసులకు చెప్పాడు .

పెద్దోడి పెళ్లి చిన్నోడి చావుకు కారణం అయిందని ఆవేదనలో తల్లిదండ్రులు
కేసు నమోదు చేసిన పోలీసులు యర్లయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు . అరెస్ట్ చేసిన నిందితుడిని రిమాండ్ కు పంపించారు. కుటుంబంలో జరిగే చిన్న చిన్న వివాదాలకు అన్నదమ్ములు శత్రువులు గా మారుతున్న నేటి రోజులలో పెళ్లి కోసం జరిగిన ఈ సంఘటన అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. పెద్దోడి పెళ్ళి చేయాలనుకున్న తల్లిదండ్రులకు చిన్నోడి చావును చూడాల్సి వచ్చింది .
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications