జగతి మేడం కోసం రంగంలోకి అనిల్ రావిపూడి... జ్యోతిరాయ్ మూవీకి అనిల్ స్ట్రాటజీ?
జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడినప్పటికీ జ్యోతిరాయ్‌కి మాత్రం ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. బుల్లితెర స్టార్‌గా తిరుగులేని స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. సడెన్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అటువైపు వెళ్లిపోయారు. చీరకట్టులో సాంప్రదాయంగా కనిపంచిన జగతి మేడం.. ఇప్పుడు గ్లామర్ షోతో కుర్రాళ్లలో సెగలు రేపుతున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఫిక్స్.. బాక్సాఫీస్ రికార్డ్‌లు బ్రేక్ అవ్వాల్సిందే !
కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ తొలుత కన్నడ సీరియల్స్‌తో ఫేమస్ అయ్యారు. జెర్సీ నెంబర్ 10, దియా, సప్లయర్ శంకర తదితర సినిమాలతో జ్యోతిరాయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దశలో ఆమెకు తెలుగు బుల్లితెరపైనా అవకాశాలు వచ్చాయి. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగువారిని పలకరించిన జ్యోతిరాయ్.. హోమ్లీ లుక్, నటనతో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ దశలో స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు ధారావాహిక స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

ఇందులో జగతి మేడంగా.. తన స్టూడెంట్స్‌ను దారిలో పెట్టే లెక్చరర్‌గా, భర్త నుంచి విడిపోయిన భార్యగా, కొడుకుకు దూరమైన తల్లిగా అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో హిట్ కావడానికి జగతి మేడం పాత్ర కీలక భూమిక పోషించింది. ఈ పాత్ర చనిపోయిన తర్వాత సీరియల్‌కు రేటింగ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతుంటారు. గుప్పెడంత మనసు సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడిన తర్వాత ఆమెను అంతా జగతి మేడం అనే పిలుస్తున్నారంటే జ్యోతిరాయ్ నటనను అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత అనూహ్యంగా బుల్లితెరకు దూరమయ్యారు జ్యోతి.
ఈమెకు 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా. అయితే సినీ దర్శకుడు సుక్కూ పూర్వజ్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసి అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో బుల్లితెరకు దూరంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు జ్యోతి. సీరియల్స్‌లో పద్ధతిగా చీరలో కనిపించిన జ్యోతి.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచారు.
కళ్ల ముందు మృత్యువు... నా చివరి కోరిక ఇదే.. బ్రహ్మముడి దీపిక రంగరాజు ఎమోషనల్
సుక్కు దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ సినిమాలో నటించారు జ్యోతి. ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కిల్లర్. యాక్షన్, సైన్స్ ఫిక్సన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. కిల్లర్ ఫ్రాంచైజీ పేరిట పలు భాగాలుగా ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. తొలి భాగానికి కిల్లర్ పార్ట్ 1- డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై సుక్కూ పూర్వాజ్, ప్రజయ్ కామత్‌లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఆ మాత్రం తెలియదా? ఎలా సీఎం అయ్యావు.. వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సెటైర్
ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ గతేడాది ఏప్రిల్ 30వ తేదీన విడుదలవ్వగా ... ఇప్పటి వరకు కిల్లర్ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సైన్స్ ఫిక్సన్, యాక్షన్ మూవీ కావడంతో మరికొంత సీజీ వర్క్, ఇతర పనులు ఉండటంతో కిల్లర్ ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ దశలో హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం రంగంలోకి దిగినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. జ్యోతిరాయ్, సుక్కు పూర్వాజ్‌లతో అనిల్ రావిపూడి దిగిన ఫోటోను జ్యోతి రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
బలుపు చూపిస్తున్నావా... తొక్కిపారేస్తా.... పటాస్ ఫైమాకి జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు, సుక్కు పూర్వాజ్‌లు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు. కిల్లర్, సూపర్ షి ఎడిటింగ్ సూట్‌ని అనిల్ గారు పరిశీలించారు. మా మధ్య జరిగిన సంభాషణ, చర్చలు, ఇతర వివరాలను మరో స్టేజ్‌పై పంచుకుంటానని జ్యోతిరాయ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుక్కుకి అనిల్ రావిపూడితో ఆ రేంజ్‌లో ఫ్రెండ్‌షిప్ ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తన ఫ్రెండ్ కోసం, జ్యోతిరాయ్ మూవీ కోసం అనిల్ ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారోనంటూ చర్చ జరుగుతోంది.
Credit: Filmibeat
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications