టెక్కీ ఆది మృతి ఇంకా మిస్టరీనే: అతనొస్తే తెలిసే చాన్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

మిర్యాలగూడ: తెలంగాణ టెక్కీ ఆదినారాయణ రెడ్డి మృతికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. ఆయన ఆస్ట్రేలియాలో మరణించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడేనికి చెందిన కోన ఆదినారాయణరెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సాయంత్రమే మాట్లాడాడు.. రాత్రికల్లా..., ఆదిలోనే చితికిన ఆదినారాయణరెడ్డి ఆశలు..

ఆదినారాయణ రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు సిడ్నీ తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు ప్రయత్నాలు సాగిస్తు్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని తెలంగాణకు చెందిన రాంరెడ్డి, సూర్య సుమేష్‌రెడ్డి, కిరణ్‌లు పరిశీలించారు. అక్కడి మహిళా డాక్టర్‌ ఒకరు వారికి వివరాలు అందించారు.

ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి

ఆయన వస్తేనే తెలుస్తుంది..

ఆయన వస్తేనే తెలుస్తుంది..

ఆస్ట్రేలియాలో నాలుగు రోజులుగా సెలవులు ఉన్నాయి. మృతదేహాన్ని పరీక్షించే వైద్యుడు కార్నియర్‌ సెలవు మీద వెళ్లాడు. బుధవారం డ్యూటీలో జాయిన్‌ అయిన తర్వాత మృతదేహాన్ని సిటీస్కాన్‌ చేసే అవకాశం ఉంది. సిటీస్కాన్‌లో మృతికి సంబంధించిన వివరాలు వస్తే మృతదేహాన్ని పరీక్షించే డాక్టర్‌ కార్నియర్‌కు పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

అలా తెలియకపోతే పోస్టుమార్టం...

అలా తెలియకపోతే పోస్టుమార్టం...

సీటీ స్కాన్ చేసిన తర్వాత కారియర్ మృతి చెందడానికి గల కారణాలతో నివేదిక ఇస్తారు. సిటీస్కాన్‌లో తెలియకపోతే మృతదేహాన్ని పోస్టుమార్టం చేస్తారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కాన్సులేట్‌కు సమాచారం అందిస్తారు. రెండు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆస్ట్రేలియా కాన్సులేట్‌, ఇండియా కాన్సులేట్‌తో చర్చలు జరిపారు. అన్ని అనుకూలిస్తే ఈ వారాంతానికి ఇండియాకు మృతదేహాన్ని పంపిస్తామని అంటున్నారు.

ఇన్ఫోసిస్ మేనేజర్ సైతం...

ఇన్ఫోసిస్ మేనేజర్ సైతం...

ఇన్ఫోసిస్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కూడా ఇప్పటికే ఇరు దేశాల కాన్సులేట్‌తో చర్చలు జరిపారు. ఆదినారాయణరెడ్డికి ఉన్న ఆరోగ్య బీమా ఉంది. దీంతో లాంఛనాలు పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా భారత్‌కు మృతదేహాన్ని పంపిస్తామని తెలిపారు.

వారు మంత్రులను కలిసారు..

వారు మంత్రులను కలిసారు..

తెలంగాణ మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహారెడ్డిలను ఆదినారాయణరెడ్డి బంధువులు మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని తెప్పిస్తామని, కాన్సులేట్‌తో మాట్లాడుతామని మంత్రులు బంధువులకు హామీ ఇచ్చారు.

ఎంపి సుఖేందర్ రెడ్డి హామీ..

ఎంపి సుఖేందర్ రెడ్డి హామీ..

కోన ఆదినారాయణరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు అన్నిఏర్పాట్లు చేసినట్లు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్‌, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులతో ఫోన్లో ఆయన మాట్లాడారు.

కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే..

కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే..

ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతోపాటు ఇన్ఫోసిస్‌ కంపెనీ ప్రతినిధులు మంగళవారం పరామర్శించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఎమ్మెల్యే బంధువులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు.

కంపెనీ ఖర్చులతో రప్పిస్తాం..

కంపెనీ ఖర్చులతో రప్పిస్తాం..

ఇన్ఫోసిస్‌ కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. కంపెనీ ఖర్చులతో ఆదినారాయణరెడ్డి మృతదేహాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister KTR and nayini Narsimha Reddy reacted on Techie Adinarayana Reddy's death in Australia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి