సౌదీలో తెలంగాణ వాసి మృతి: అతని మృతదేహం తరలిస్తుండగా స్నేహితుడు

Subscribe to Oneindia Telugu

రియాద్: సౌదీ అబిరేయాలోని రియాద్‌లో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం సౌదీ వెళ్లిన స్నేహితులు ఒకే రోజు మరణించారు.

మెట్‌పల్లికి చెందిన యాకుబ్ అలీ (48), అప్సర్ జానీ (47) స్నేహితులు. ఉపాధి కోసం ఇద్దరూ కలిసి 15 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. రియాద్‌లోని జానీ రెడీమేడ్ వస్త్రవ్యాపారం ప్రారంభించగా, అలీ అతడితో ఉంటున్నాడు. బుధవారం యాకుబ్ అలీ గుండె పోటుతో మృతి చెందాడు.

Telangana person died in saudi arabia

అతడి మృతదేహాన్ని స్వగ్రామమైన మెట్‌పల్లికి తరలించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.

  Today's Top Trending News

  ఈ ఘటనలో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన యూసుఫ్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. స్నేహితులిద్దరూ ఒకే రోజు మరణించడంతో మెట్‌పల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana person died in saudi arabia and his friend killed in a accident on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి