ఎక్స్(X)కు బ్రేక్: స్తంభించిన సోషల్ మీడియా.. ఏఐ 'గ్రోక్' కూడా డౌన్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (X) శుక్రవారం రాత్రి ఒక్కసారిగా నిలిచిపోయింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ఎక్స్ సేవలను వినియోగించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్ సైట్ మాత్రమే కాకుండా, ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' కూడా పని చేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేశారు.
వెబ్ సైట్, యాప్ రెండూ బంద్!
శుక్రవారం రాత్రి నుంచి ఎక్స్ వెబ్ వెర్షన్, మొబైల్ యాప్ రెండింటిలోనూ సాంకేతిక లోపాలు తలెత్తాయి. వెబ్ సైట్ ఓపెన్ చేసినా ఖాళీ స్క్రీన్ కనిపించడం లేదా 'క్లౌడ్ఫ్లేయర్ ఎర్రర్' పేజీలు దర్శనమిచ్చాయి. కొందరికి సైట్ లోడ్ అయినా కొత్త పోస్టులు కనిపించలేదు, మరికొందరికి అసలు పోస్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. డౌన్ డిటెక్టర్ వంటి వెబ్సైట్లలో యూజర్లు భారీగా ఫిర్యాదులు నమోదు చేశారు.

ఏఐ బాట్ 'గ్రోక్' కూడా పరేషాన్..
సాధారణంగా ఎక్స్ నిలిచిపోయినప్పుడు కేవలం ఫీడ్ మాత్రమే ఇబ్బంది పెడుతుంది. కానీ ఈసారి ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్' కూడా మొరాయించడం గమనార్హం. దీనివల్ల ప్రీమియం సబ్స్క్రిప్షన్ కలిగిన యూజర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
స్పందించని సంస్థ
గత వారం కూడా ఎక్స్‌లో స్వల్పంగా అంతరాయం కలగగా.. తాజా సమస్య మరింత తీవ్రంగా ఉంది. అయితే ఈ సాంకేతిక లోపానికి గల కారణాలపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు యూజర్లు తమ అసహనాన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పంచుకుంటున్నారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications